Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్లన సాగర్ మంటలు.. హరీశ్ రావు రోడ్లపై వంటలు చేయలేదా?: రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్

తెలంగాణ రాష్ట్రంలో మల్లన సాగర్ మంటలు చెలరేగాయి. ఈ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనబాట పట్టారు. వీరిపై పోలీసులు తన లాఠీని ఝుళిపించారు. వీరికి విపక్షాలు అండగ

మల్లన సాగర్ మంటలు.. హరీశ్ రావు రోడ్లపై వంటలు చేయలేదా?: రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్
, బుధవారం, 27 జులై 2016 (10:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో మల్లన సాగర్ మంటలు చెలరేగాయి. ఈ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనబాట పట్టారు. వీరిపై పోలీసులు తన లాఠీని ఝుళిపించారు. వీరికి విపక్షాలు అండగా నిలిచాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.
 
అయితే, ఈ మల్లన్ సాగర్ భూనిర్వాసితుల మహాధర్నా నిర్వహించారు. ఇందులో రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రాజెక్టుల పేరిట రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 
భూముల కోసం రైతులను బలవంతపెట్టి సంతకాలు తీసుకుంటే ప్రాజెక్టులు పూర్తికావని ఆయన అన్నారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని, దాన్ని అడ్డుకోరాదని సూచించారు.
 
తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న వేళ, హరీశ్ రావు రహదారులను దిగ్బంధం చేసి వంటలు వండుకుని తినలేదా? వాళ్లు చేస్తే కరెక్ట్, భూములు పోతాయన్న భయంతో ప్రజలు అదే పని చేస్తే తప్పా? అని పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవు మాంసం తరలిస్తున్నారనీ.. మధ్యప్రదేశ్‌లో మహిళల దాడి!