Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరామర్శకు వెళ్తే అంత ఉలికిపాటు ఎందుకు... భయమెందుకు... అంటే ఇందుకూ..!

ప్రమాదానికి గురైన బస్సు అధికార పార్టీకి చెందిన జేసీ దివాకర్ బ్రదర్స్‌ది. ఈ ఒక్క కారణమే ప్రభుత్వాన్ని అఘమేఘాల మీద వాస్తవాలను మరుగున పడేయడానికి పరుగులెత్తించేలా చేసింది. చనిపోయిన మృతులకు, డ్రైవర్‌కు కూడా పోస్ట్ మార్టమ్ చేయకుండా శవాన్ని తరలించే సాహసానిక

Advertiesment
పరామర్శకు వెళ్తే అంత ఉలికిపాటు ఎందుకు... భయమెందుకు... అంటే ఇందుకూ..!
హైదరాబాద్ , శనివారం, 4 మార్చి 2017 (03:17 IST)
జరిగింది ఘోరం. నందిగామ సమీపంలో కన్వర్ట్ కింది పడిన బస్సు ప్రమాదంలో 11 మంది మరణించారు. 30 మంది పైగా తీవ్రగాయాలతో బతికి బయటపడ్డారు. రాష్టం యావత్తూ కలవరపడింది. యధాప్రకారం రాష్ట్ర పాలకుడు ఘటనా స్థలికి వెళ్లలేదు. ప్రతిపక్షనేత బాధ్యతపడి అక్కడికి వెళ్లాడు. జరిగిన ప్రమాదం మానవ తప్పిదమే కానీ మరే సాకులూ కావని తేలిపోయింది. ప్రమాదానికి గురైన బస్సు అధికార పార్టీకి చెందిన జేసీ దివాకర్ బ్రదర్స్‌ది. ఈ ఒక్క కారణమే ప్రభుత్వాన్ని అఘమేఘాల మీద వాస్తవాలను మరుగున పడేయడానికి పరుగులెత్తించేలా చేసింది. చనిపోయిన మృతులకు, డ్రైవర్‌కు కూడా పోస్ట్ మార్టమ్ చేయకుండా శవాన్ని తరలించే సాహసానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ పూనుకున్నాడు. దాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నేత మహా నేరమైపోయింది. ఆసుపత్రిలో జరిగిన అవకతవకలు అన్నీ పక్కకుపోయాయి. పోస్ట్ మార్టమ్ లేకుండా శవాన్ని తరలిస్తారా అన్న పాపానికి ప్రతిపక్ష నేత మహా నేరస్తుడైపోయాడు. ఎందుకిలా.. టీవీ మీడియా ద్వారా ఘటనలన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకింత అరాచకానికి దిగింది. కేవలం రాజకీయమే అని అనంతపురం జిల్లాను తన పట్టులోంచి పోగొట్టుకోకూడదన్న దుగ్ధే ఆ ఘోరప్రమాదం పట్ల మౌనం పాటించేలా చేసిందా అనే ప్రశ్నకు జవాబు ఔననే వస్తోంది.
 
సీఎం చంద్రబాబు జేసీ సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడంతో అప్పుడప్పుడు ఎంపీ జేసీ పరోక్షంగా ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఈ తరుణంలో వారిపై బస్సు ప్రమాద కేసు పెడితే అసలుకే ఎసురొచ్చి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది. మరో వైపు కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదననే ఆందోళన ఆయనలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. 
 
భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లాక గంగుల కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరడం, శిల్పా మోహన్‌రెడ్డి గుర్రుగా ఉండటం పట్ల ఏం చేయాలో తోచక చంద్రబాబు తల పట్టుకున్నారు. ఈ స్థితిలో జేసీ సోదరులతో వైరం పెంచు కోవడానికి బాబు ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఒక అబద్ధాన్ని పదిమార్లు పదే పదే చెప్పి.. అసలు విషయం మరుగున పడేలా చేసి, అబద్ధ మే అసలు నిజమని జనాన్ని నమ్మించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇందుకు క్యాబినెట్‌ సమావేశాన్నే వేది కగా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమిని ఫ్రై చేస్తావా.. అందుకే రో...బో...తో కొడతానంటున్న నాసా