Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Advertiesment
Srivari Parvati festival
, ఆదివారం, 10 జనవరి 2021 (09:21 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున  కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
       
గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 5.30 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.
 
ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.
 
ఆర్జితసేవలు రద్దు :
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 15న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
 
14వ తేదీ వరకు తిరుమలలో విష్ణు బిల్వార్చన 
పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుమలలోని వసంత మండపంలో జనవరి 10 నుండి 14వ తేదీ వరకు ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు టీటీడీ విష్ణు బిల్వార్చన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీకా వల్ల కాదు.. అనుమానాస్పద విషం వల్ల మృతి : భారత్ బయోటెక్ క్లారిటీ