జలసిరి : శ్రీశైలంకు వరద తాకిడి.. అన్ని గేట్లు ఎత్తివేత (Video)
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ముఖ్యంగా, నల్లమల అడవుల్లో ఉన్న ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ముఖ్యంగా, నల్లమల అడవుల్లో ఉన్న ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది.
ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతుండడంతో 11 గేట్లను ఎత్తివేశారు. 2009 సంవత్సరం తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన అన్ని గేట్లు ఎత్తివేయడం గమనార్హం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు జోరుగా వస్తోంది.
కాగా… శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.04 లక్షలు కాగా అవుట్‌ఫ్లో 2.28 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీలుగా ఉంది. అలాగే ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.