నీలిచిత్రాలు బహిరంగ ప్రదేశాల్లో చూశారో... తాటతీస్తాం: శ్రీకాకుళం డీఎస్పీ
నీలిచిత్రాలు చూడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోతున్న తరుణంలో నీలిచిత్రాలను ఎక్కడపడితే అక్కడ చూడటం అలవాటైపోయింది. అయితే ఇకపై అలాంటి పప్పులు ఉడకవని శ్రీకాకుళం డీఎస్పీ భార్గ
నీలిచిత్రాలు చూడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోతున్న తరుణంలో నీలిచిత్రాలను ఎక్కడపడితే అక్కడ చూడటం అలవాటైపోయింది. అయితే ఇకపై అలాంటి పప్పులు ఉడకవని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవ రావు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఆముదాలవలసకు చెందిన మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు మొబైల్ ఫోన్‌లో ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
నీలి చిత్రాలు వీక్షించడం, మరొకరికి బదిలీ చేయడం వంటి పనులను చేయకూడదన్నారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లో నీలి చిత్రాలు చూడటం నేరమని, అటువంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆముదాలవలస మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు ఇంటర్నెట్ ద్వారా ఇతరులకు పంపించిన నలుగురు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన తాతారావు, మోహన్, నాని, అప్పన్నలు ఒకరి మొబైల్ నుంచి మరొకరి మొబైల్‌కు బదిలీ చేస్తుండగా రెండో పట్టణ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారన్నారు.