Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాకుళంలో నలుగురు ఖాకీలను మింగేసిన రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళంలో నలుగురు ఖాకీలను మింగేసిన రోడ్డు ప్రమాదం
, సోమవారం, 23 ఆగస్టు 2021 (15:22 IST)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుళ్లు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని పిటిషన్లపై మరోమారు విచారణ వాయిదా