తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కోటబొమ్మాళి సెషన్స్ కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు.
వాస్తవానికి ఇటీవలే ఆయన ఈఎస్ఐ స్కాంలో జైలుకు వెళ్లొచ్చారు. ఆసమయంలో ఆయన అనారోగ్య పరంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇుపుడు మరోమారు జైలు పాలయ్యారు.
నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోటబొమ్మాళి సెషన్స్ కోర్టులో హాజరు పర్చగా, ఆయనకు న్యాయమూర్తి రెండు వారాల పాటు అంటే ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు.
దాంతో పోలీసులు అచ్చెన్నాయుడిని అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. అటు, అచ్చెన్నాయుడి అరెస్ట్, ఇటు పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి ఘటనతో టీడీపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది.