రంగారెడ్డి జిల్లాలో కఠోర భూతపస్సు చేస్తున్న బాబా... గుడి బాగు కోసమట...
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ''శ్రీ సత్యం శివం సుందరం దాస్ మహాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూతపస్సు చేస్తున్నారు. తల మాత్రమే భూమిపైకి కనపడుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ''శ్రీ సత్యం శివం సుందరం దాస్ మహాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూతపస్సు చేస్తున్నారు. తల మాత్రమే భూమిపైకి కనపడుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలోని జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదికైంది. బాబా చేసే ఈ తపస్సును ''దసరా నవరాత్రి భూతపస్సు'' అని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాత్యాగి భూతపస్సును తిలకిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు కఠోర తపస్సు చేసిన తర్వాత పూజలు ఉంటాయని అంటున్నారు. బాబా ఆ ఊళ్లోని గుడి బాగు కోసమే ఈ దీక్ష చేపట్టినట్లు స్థానికులు అంటున్నారు.
ఇన్నాళ్లూ బాబా వద్ద సలహాలు, సూచనలు తీసుకోవడానికి వచ్చిన భక్తులు ఇప్పుడు ఆయన చేస్తోన్న తపస్సును వీక్షించేందుకు తరలివస్తున్నారు. ఈ యజ్ఞం ఫలితంగా దేశంలోని ప్రజలు ప్రకృతి వైపరిత్యాలకు గురికాకుండా ఉంటారని భూతపస్సు నిర్వహిస్తున్న మహాత్యాగి అనుచరులు వివరించారు.