తిరుమలలో మూడు రోజుల పాటు జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం మే 17 నుంచి 19 వరకు వైభవంగా జరగనుంది. నారాయణగిరి గార్డెన్స్‌లోని పరిణయోత్సవ మండపంలో ఏటా శ్రీదేవి భూదేవి, శ్రీనివాసుల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శ్రీ మలయప్ప స్వామిని మొదటి రోజు గజవాహనం, రెండో రోజు అశ్వ వాహనం, చివరి రోజు గరుడ వాహనంపై పూజిస్తారు. ఈ మూడు రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్‌లో ప్రతి వైశాఖ శుద్ధ దశమి తిథికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తుంది.