Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక నిధి మాత్రమే... నేడు అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్రకటన

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా నిధులను పుష్కలంగా అందజేయనుంది. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రంలోగా ప్రత్యేక ప్రకట

Advertiesment
ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక నిధి మాత్రమే... నేడు అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్రకటన
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (05:08 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా నిధులను పుష్కలంగా అందజేయనుంది. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రంలోగా ప్రత్యేక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. విభజన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిన కేంద్రం.. ప్రత్యేక నిధిని మంజూరు చేస్తామని ప్రకటించి, ఆ దిశగా కసరత్తు చేసింది. 
 
ఇందులోభాగంగా, ఏపీకి ప్యాకేజీపై కేంద్రం చేసిన కసరత్తు ఓ కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బుధవారం సాయంత్రం ప్యాకేజీని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హోదా ప్రయోజనాలన్నీ కలగలిపి ప్యాకేజీ రూపొందించామని కేంద్రం చెబుతోంది. ఇందులో ప్రాజెక్టులకు నిధులు, రాజధాని నిర్మాణంపై కేంద్రం స్పష్టంగా చెప్పబోతోంది. పోలవరానికి 100శాతం నిధులపై తన బాధ్యతేనని కేంద్రం హామీ ఇవ్వనుంది. నాబార్డు ద్వారా రుణం వచ్చే ఏర్పాటు చేసి.. అది కూడా తన బాధ్యతగా కేంద్రం తీసుకోబోతున్నట్లు చెప్పబోతోంది. 
 
పరిశ్రమలకు రాయితీలపై రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని కేంద్రం ప్రకటించబోతోంది. పారిశ్రామిక రాయితీలతో పాటు.. పరిశ్రమలు పెట్టే వారికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోన్నట్లు సమాచారం. రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై.. స్పష్టమైన భరోసాను కేంద్రం ఇవ్వనుంది. ప్రత్యేక హోదా నిధులు, సాధారణ నిధుల మధ్య ఉన్న.. 30 శాతం తేడాను ప్యాకేజీలో కేంద్రం కలపనుంది. కీలకమైన రాజధాని నిర్మాణంపైన కేంద్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి మార్కులేస్తానని ఉపాధ్యాయుడు అనేక సార్లు అత్యాచారం చేశాడు.. ఎక్కడ?