Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను నోరు తెరిస్తే మంత్రి వెల్లంపల్లి బయట తిరగలేడు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

Advertiesment
Somishetti Venkateshwarlu
, మంగళవారం, 24 నవంబరు 2020 (07:46 IST)
విజయవాడలో నిర్వహించదలచిన ఆర్యవైశ్య సంఘం సమావే శాన్ని వైశ్యుడైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అడ్డుకోవడం, పోలీసుల సాయంతో జరుగుతున్న సమావేశాన్ని నిలిపివేయించడం  ఎంతమాత్రం సమంజసం కాదని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఆయన కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాము ఎటువంటిధర్నాలు, ఆందోళనలు లేకుండా శాంతియుతంగా ఒక హోటల్లో సమావేశమైతే, దాన్ని అడ్డుకోవడం ఏమిటన్నారు. సమావేశానికి వచ్చిన ఆర్యవైశ్యులంతా సమావేశాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారని, వైశ్యుల సమావేశాన్ని మంత్రి నిలుపుదల చేయించడాన్ని అక్కడికొచ్చిన ఆర్యవైశ్యులంతా తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.

వైశ్యులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి, తక్షణమే తన అహంకారపూరిత చర్యలను మానుకుంటే మంచిదని  వెంకటేశ్వర్లు హితవుపలికారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఆర్యవైశ్యనేతలు సమావేశానికి హాజరయ్యారని, వారంతా మంత్రి తీరుని తప్పుపట్టారన్నారు.

తన నాయకుడి మెప్పుకోసం ఇటువంటి పనులుచేస్తున్న వెల్లంపల్లి మంత్రి పదవికి అనర్హుడని,  వైశ్యుల పేరుచెప్పి అందినకాడికి దండుకుంటున్న ఆయన్ని తక్షణమే ముఖ్యమంత్రి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సోమిశెట్టి డిమాండ్ చేశారు.

పదవులకోసం జగన్ పంచనచేరి, తన తొత్తులతో మాట్లాడిస్తున్న వెల్లంపల్లి, ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసమేఇదంతా చేశాడన్నారు. మంత్రి నియోజకవర్గంలో సమావేశం పెడితే తప్పేమిటని ప్రశ్నించిన సోమిశెట్టి, పార్టీలు ఫిరాయించే వెల్లంపల్లి లాంటివారిని చూసి భయపడేదిలేదని తేల్చిచెప్పారు.

తాను తొలినుంచీ ఒకేపార్టీ జెండా మోస్తున్నానని, తనకు మద్ధతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా నని సోమిశెట్టి తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి, ఇలాంటి పనులుచేయడానికి వెల్లంపల్లి సిగ్గుపడాలన్నారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు జరుగుతుంటే, భక్తులు స్నానమాచరించడానికి స్వచ్ఛమైన నీరేలేకుండా చేశారని, తాగునీరు కూడాలేక భక్తులు అవస్థలు పడతున్నారన్నారు.

చంద్రబాబునాయుడు నిర్మించిన స్నానాలఘాట్లకే రంగులుపూసి, రూ.200కోట్ల పైచిలుకు నిధులు కాజేశారన్నారు. తమకు నోరుందని, అదితెరిస్తే, వెల్లంపల్లి లాంటివారు బయటతిరగలేరని, సోమిశెట్టి హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ‘అభయం’ యాప్‌ను ప్రారంభించిన జ‌గ‌న్