Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ జగన్‌ని నిండా ముంచింది నువ్వు.. మళ్లీ జైలుకు పంపుతావా సాయిరెడ్డీ: సోమిరెడ్డి ధ్వజం

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని లక్ష కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుల్లో ఇరికించింది, జగన్‌ని నేరస్థుడిని చేసిందీ, జైలుకు పంపించిందీ ముమ్మాటికీ వైకాపా పార్టీ నేత ఎమ్మెల్సీ విజయసాయిరెడ్డేనని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్‌ని నిండా ముంచింది నువ్వు.. మళ్లీ జైలుకు పంపుతావా సాయిరెడ్డీ: సోమిరెడ్డి ధ్వజం
హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (06:02 IST)
వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని లక్ష కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుల్లో ఇరికించింది, జగన్‌ని నేరస్థుడిని చేసిందీ, జైలుకు పంపించిందీ ముమ్మాటికీ వైకాపా పార్టీ నేత ఎమ్మెల్సీ విజయసాయిరెడ్డేనని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శాసనమండలిని, మంత్రి లోకేశ్‌ను సోషల్‌ మీడియాలో అసభ్యంగా చూపించిన ఘటన అనంతరం వైకాపా సోషల్ మీడియాకు నోటీసులు అందించడానికి పోలీసులు వస్తే వారిని బెదిరించిన విజయ సాయిరెడ్డిపై సోమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
 
సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న ఇందూరి రవికిరణ్‌పై ఫిర్యాదు ఆధారంగా అరెస్టు చేసి విచారిస్తే జగన్‌, విజయ్‌సాయిరెడ్డి ప్రభుత్వాన్ని, పోలీసులను బెదిరించడమేమిటని మంత్రి ప్రశ్నించారు. సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకుని అసభ్య వ్యాఖ్యలు చేస్తే వూరుకునేది లేదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 
 
సోషల్‌మీడియాను వైకాపా సొంత మీడియాగా వాడుకుంటోందని సోమిరెడ్డి విమర్శించారు.  తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియాకు వ్యతిరేకం కాదని.. అసభ్య వ్యాఖ్యలు చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
సోమిరెడ్డి నోటి దూల ఎంత స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.. కానీ మనం సక్రమంగా ఉండి ఇతరులను కామెంట్ చేస్తే దానికి ఒక అర్థం, విలువా ఉంటాయి కదా. అన్నీ వదిలేసి ఇతరులు మాత్రం నిష్టగా ఉండాలంటే ఎలా కుదుర్తుంది అంటున్నారు నెటిజన్లు.
 
చంద్రబాబును, నారా లోకేశ్‌‌ను ఎవరూ ఏమనకూడదు కానీ సంవత్సరాలుగా వైఎస్ జగన్‍‌ని ఇంటా బయటా, అసెంబ్లీలో కూడా ఘోరమైన దూషణ భూషణలతో, బూతులతో సత్కరించిన పాపానికి టీడీపీ నేతలను ఏం చేయాలని నెటజన్లు ఎత్తి చూపుతున్నారు. స్వయంగా చంద్రబాబు తనయుడే వైఎస్ జగన్‌పై పెట్టిన ఘోరమైన వ్యాఖ్యలను నెటిజన్లు ఉదాహరణ పూర్వకంగా ఎత్తి చూపిన వైనంపై సోమిరెడ్డి నోరు ఎత్తకపోవడం గమనార్హం.
 
సోషల్ మీడియా అనేది మీకొక న్యాయంగానూ, ఇతరులకు మరొక న్యాయంగానూ ఉండదు. ప్రింటి మీడియా మర్యాదలను దాటేసిన సోషల్ మీడియా తప్పు ఎవరు చేసినా చేపలబండ కేసి తోమడం మొదలుపెట్టారు. వాళ్లు చంద్రబాబునూ వదల్లేదు. వైఎస్ జగన్‌నూ వదలలేదు. చివరకు మోదీని వదల్లేదు.  మా సోషల్ మీడియాతో ఇతరులపై దుమ్మెత్తిపోస్తాం. కాని మామీద మాత్రం ప్రతిపక్షనేతను సమర్థించే సోషల్ మీడియా వారు రాళ్లు వే్స్తే ఊరుకోం అంటే ఎలా కుదురుతుంది. 
 
ఈ వ్యవహారంతో మరింత పరువు కోల్పోవడం తప్పితే చంద్రబాబు, ఆయన తనయుడు బావుకున్నది ఏమిటి అని నెటిజన్ల ప్రశ్న. దీనికి ఎవరు జవాబు చెబుతారు?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విషాద సమయంలోనూ జై జగనా...పరామర్శల్లోనూ రాజకీయమే అయితే పోయేది నేతల పరువే..