Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు .. ఎందుకో తెలుసా?

Advertiesment
train
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (08:33 IST)
విశాఖపట్టణం రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే అనేక రైళ్ళు రద్దు అయ్యాయి. సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునకీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించినట్టు వెల్లడించారు. అలాగే, ఇంకొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు. 
 
ప్రస్తుతం రద్దు చేసిన రైళ్లను పరిశీలిస్తే, ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశాఖ రాయపూర్, 7 నుంచి 13వ వరకు రాయపూర్ విశాఖ రైళ్లను మహాసముండ - రాయపూర్ - మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు తెపారు. 
 
అలాగే ఈ నెల 11వ తేదీన విశాఖ - కోర్బా, 12న కోర్బా-విశాఖ రైలును, 6 నుంచి 12వ తేదీ వరకు విశాఖ - దుర్గ్, 7 నుంచి 13 వరకు దుర్గ్ - విశాఖ రైళ్లను కూడా రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. 
 
దారి మళ్లించిన రైళ్లలో తిరుపతి - బిలాస్‌పూర్ మధ్య నడిచే రైలు ఈ నెల 8, 11 తేదీల్లో, బిలాస్‌పూర్ - తిరుపతి మధ్య నడిచే రైలును 10, 13 తేదీల్లో పూరీ అహ్మదాబాద్ రైలును 6,8,9,10,13,15 తేదీల్లో, అహ్మదాబాద్ - పూరీల మధ్య నడిచే రైలును 8, 10, 11, 12, 15 తేదీల్లో టిట్లాఘర్, సంబల్‌పూర్, జూర్సుగూడ ప్రాంతాల మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు. 
 
ఆలస్యంగా బయలుదేరే రైళ్లలో విశాఖ - కోర్బా రైలు ఈ నెల 12వ తేదీన 5 గంటలకు విశాఖ - నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ 8, 15 తేదీల్లో 2 గంటలకు, హజ్రత్ నిజాముద్దీన్ - విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ 12న 5 గంటలకు, తిరుపతి - బిలాస్‌పూర్ రైలు 15న 4 గంటలకు, విశాఖ - భగత్ కీ కోఠి రైలు ఆస్యంగా బయలుదేరుతాయని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైరస్‌ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం ఎలా జరిగిందంటే..