Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిషన్ భగీరథ.. పైప్ లైన్‌లో పాము... పరుగులు తీస్తే?

Advertiesment
మిషన్ భగీరథ.. పైప్ లైన్‌లో పాము... పరుగులు తీస్తే?
, బుధవారం, 26 డిశెంబరు 2018 (15:49 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికీ తాగు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల పైప్ లైన్లను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఇలా ఏర్పాటు చేసిన వాటర్ పైపుల్లో ఓ పాము కనిపించింది. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. 
 
మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని చేవెళ్ల మండలం, మల్కాపూర్ గ్రామంలో నీళ్లు అందిస్తుండగా, ఒక్కసారిగా వాల్వ్ నుంచి పాము బయటకు వచ్చింది. అయితే ఆ పాము అప్పటికే చనిపోయింది. పామును చూసే సరికి అందరూ పరుగులు తీశారు. కానీ పాము చనిపోయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్యాప్ ద్వారా వస్తున్న నీటిని తాగేందుకు ప్రజలు జడుసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లోకి షియోమీ ''పోకో ఎఫ్1'' స్మార్ట్‌ఫోన్