Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేక్ డ్యాన్స్ కాదు.. స్నేక్ చట్నీ.. శుభ్రంగా ఆరగించిన ఫ్యామిలీ.. లబోదిబోమన్నారు

రోలులో దుమ్మూ ధూళీ మాత్రమే కాదు.. తేళ్లు, పాములు, పురుగులు కూడా వచ్చి చేరతాయని పల్లెటూళ్ల అనుభవం. కాబట్టే తరం తర్వాత తరానికి గ్రామీణులు రోలు విషయంలో జాగ్రత్తలు చెప్పేవారు. కానీ ఈ విషయం పాటించని ఒక మహిళ చట్నీ చేయబోయి పొరపాటు రోలులో ఉన్న పామును కూడా శు

Advertiesment
Khillaghanapuram
హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (02:49 IST)
రోట్లో మసాలాలు, గింజలు వేసి నూరేముందర ఒకటికి రెండు సార్లు పాత బట్టతో రోలు శుభ్రం చేయమని పెద్దవారు ఊరికే అనలేదు. రోలులో దుమ్మూ ధూళీ మాత్రమే కాదు.. తేళ్లు, పాములు, పురుగులు కూడా వచ్చి చేరతాయని పల్లెటూళ్ల అనుభవం. కాబట్టే తరం తర్వాత తరానికి గ్రామీణులు రోలు విషయంలో జాగ్రత్తలు చెప్పేవారు. కానీ ఈ విషయం పాటించని ఒక మహిళ చట్నీ చేయబోయి పొరపాటు రోలులో ఉన్న పామును కూడా శుభ్రంగా దంచిపారేశింది. అంతే శుభ్రంగా ఆ పాము చట్నీని ఆరగించిన ఆ ప్యామిలీ సభ్యులు లేటుగా విషయం తెలసి లబోదిబోమంటూ ఆసుపత్రికి పరిగెత్తారు. ఆ పాము విషపాము కాదు కాబోలు వారికెవరికీ ప్రాణాపాయం కలగలేదు.
 
తెలంగాణలో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట.. గురువారం ఉదయం.. గొల్ల రాజ మ్మ అనే మహిళ చట్నీ కోసం టమాటాలు, మిరపకాయలు ఉడికించింది. చట్నీ నూరేందుకు ఇంట్లోని పెద్ద రోట్లో వాటిని పోసి రోకలితో గట్టిగా నూరింది. అయితే, అప్పటికే అందులో ఓ పాము పడుకుని ఉంది. దాన్ని గమనించని రాజమ్మ రోకలి దెబ్బలేసింది.  అంతే పాము ముక్కలుముక్కలైంది.. చట్నీలో మిక్సయిపోయింది. 
 
రాజమ్మతో పాటు ఆమె కుమార్తె కృష్ణవేణి, కుమారుడు అదే చట్నీతో భోజనం చేశారు. గొర్రెల మంద దగ్గర ఉన్న పెద్ద కుమారుడు సాయికి కూడా తీసుకెళ్లారు. కొంత అన్నం తిన్న తర్వాత సాయికి చట్నీలో పాము తోక ముక్క కనిపించింది. అతడు చట్నీని పరిశీలించగా టమాటాలతో పాటు పాము ముక్కలు కనిపించాయి.
 
దీంతో ఆందోళనకు గురైన కుటుంబం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
నిజానికి ఆ పాము విషపాము అయితే రోట్లో దంచేటప్పుడు పాము కోర కూడా ముద్దయ్యేది కాబట్టి తిన్న వెంటనే అందరూ హరీమనేవారు. విషరహిత పాము కాబోలు కొద్దిలో ప్రాణాలు దక్కించుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఆత్మహత్యకు ఆ వ్యవహారమే కారణమట..