Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని చంపేసిన అక్క... ఎక్కడ?

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని అక్క చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం జిల్లా చండ్రుపాడు మండలం రవికంపాడు గ్రామాని చెందిన కావేటి వెంకటేశం(26) అనే వ్యక్తి 18 నెలల

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని చంపేసిన అక్క... ఎక్కడ?
, ఆదివారం, 2 జులై 2017 (11:14 IST)
ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని అక్క చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం జిల్లా చండ్రుపాడు మండలం రవికంపాడు గ్రామాని చెందిన కావేటి వెంకటేశం(26) అనే వ్యక్తి 18 నెలల క్రితం కనిపించకుండా పోయాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీసి మిస్సింగ్ కేసులోని మిస్టరీని ఛేదించారు. 
 
ఖమ్మం జిల్లా రవికంపాడుకు చెందిన కావేటి రాములు సింగరేణి కార్మికుడిగా ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌ స్థిరపడ్డాడు. రాములు అనే వ్యక్తికి నాగేశ్వర రావు, వెంకటేశం అనే ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె నాగమణి (30) ఉన్నారు. నాగమణిని ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన కట్ట పోచయ్యతో వివాహం జరిపించారు. కొద్దిరోజులు కాపురం చేసి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన వేల్పుల మల్లేశం(35)తో వివాహేతర సంబంధం పెటుకుని అతడితోనే కలిసి ఉంటుంది.
 
నాగమణి తండ్రి రాములు తన ఉద్యోగ విరమణ అనంతరం పెద్దకొడుకుకు వ్యవసాయ భూమి, చిన్న కొడుకుకు సింగరేణి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. తండ్రి ఉద్యోగం తమ్ముడైన వెంకటేశంకుకాకుండా తన ప్రియుడైన మల్లేశంకు వచ్చేందుకు నాగమణి పథకం పన్నింది. మల్లేశంను వివాహమాడి, వెంకటేశంను హతమారిస్తే ఉద్యోగం అతడికే వస్తుందని ఆలోచన చేసింది.
 
వెంకటేశంను హతమార్చేందుకు పథకం పన్నిన నాగమణి గతేడాది జనవరి 15న వెంకటేశంను కటికెనపల్లి‌లోని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. వెంకటేశ్‌‌ వచ్చాక ముగ్గురు కలిసి విందు చేసుకున్నారు. ఆ తర్వాత మల్లేశం, నాగమణి కలిసి వెంకటేశ్‌ను గొంతునులిమి హత్య చేశారు. అదే రాత్రి శవాన్ని మండలంలోని పత్తిపాకకు చెందిన చిక్కాల రాయమల్లు(40) కారులో చామనపల్లి వాగులోకి తరలించారు. 
 
అక్కడే గోయ్యి తీసి పూడ్చి పెట్టినట్టు పోలీసుల విచారణలో కనుగొన్నారు. దీంతో నాగమణి, మల్లేశంలతో పాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్‌ చిక్కాల రాయమల్లు, అరెస్టు చేసి, హత్యకు పరోక్షంగా సహకరించిన వెంకటేశం సోదరుడు నాగేశ్వర్‌ రావులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజేందర్‌రెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిగరెట్‌ కాల్చొద్దన్నాడని దివ్యాంగుడిని రైల్లోంచి తోసేశారు...