Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శిరీషకు నా భర్తకు లింకులేదన్న రచన: శిరీష సూసైడ్ వెనక బలమైన కారణం ఉంటుందన్న తేజస్విని

ఆర్జే స్టూడియోలో మరణించిన శిరీష ఆత్మహత్య కేసులో ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. శిరీషది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబీకులు అంటుంటే.. శిరీషకు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని.. ఉన్నతాధి

శిరీషకు నా భర్తకు లింకులేదన్న రచన: శిరీష సూసైడ్ వెనక బలమైన కారణం ఉంటుందన్న తేజస్విని
, మంగళవారం, 27 జూన్ 2017 (18:56 IST)
ఆర్జే స్టూడియోలో మరణించిన శిరీష ఆత్మహత్య కేసులో ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. శిరీషది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబీకులు అంటుంటే.. శిరీషకు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని.. ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఎస్సై సతీమణి రచన అంటున్నారు. శిరీష మృతి పట్ల అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 
 
ఈ నేపథ్యంలో రాజీవ్, శ్రవణ్‌లను విడివిడిగా పోలీసులు విచారించారు. మంగళవారం ఉదయం ఈ కేసులో కీలక సాక్షి తేజస్విని వెలుగులోకి రాగా, ఆపై కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన తొలిసారిగా తన వాదనను వినిపించారు. తన భర్త మృతికి శిరీష వివాదం కారణం కానేకాదన్నారు. 
 
ఇలాంటి కేసులను ఆయన ఎన్నో పరిష్కరించాడని రచన చెప్పారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఏసీపీ గిరిధర్ తన భర్తను వేధించాడని, ఆయన్ను విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందన్నారు.
 
మరోవైపు రాజీవ్ విషయంలో తను, శిరీష గొడవ పడ్డామని తేజస్విని చెప్పింది. తామిద్దరం రోడ్డుపై తన్నుకుంటుంటే విడదీయలేక రాజీవ్ వందకు కాల్ చేసి పోలీసులను పిలిపించాడని.. అప్పుడే కేసును పరిష్కరించి వుంటే ఇప్పుడింత దారుణం జరిగి వుండేది కాదని తేజస్విని వెల్లడించింది. 
 
రాజీవ్ లేని సమయంలో తాను స్టూడియోకు వెళ్లి, అతన్ని వదిలివేయాలని శిరీషతో వాగ్వాదానికి దిగేదాన్ని. అప్పుడు తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించిందని, ఆపై కాసేపటికి రాజీవ్ వచ్చాడని రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించింది. అప్పట్లోనే పోలీసులు కలుగజేసుకుని వుంటే శిరీష మరణించేది కాదని తేజస్విని వెల్లడించింది. 
 
ఫేస్ బుక్‌లో శిరీష ఫోటోలను రాజీవ్ ట్యాగ్ చేసినప్పుడు తనకు తొలిసారిగా అనుమానం వచ్చిందని తేజస్విని తెలిపింది. రాజీవ్ కోసమే హైదరాబాద్ వచ్చానని.. రాజీవ్‌ను గాఢంగా ప్రేమించబట్టే శిరీషతో గొడవకు దిగానని.. దాని కారణంగా శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని తాను భావించలేదని.. ఆమె మృతి వెనుక మరో బలమైన కారణం ఉండే ఉంటుందని తేజస్విని పోలీసులతో చెప్పినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే?