Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమీషన్లు తీసుకుంటే తప్పేంటని అడిగారు..? పదవికి రాజీనామా చేశారు?

రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామ

Advertiesment
కమీషన్లు తీసుకుంటే తప్పేంటని అడిగారు..? పదవికి రాజీనామా చేశారు?
, ఆదివారం, 18 మార్చి 2018 (13:06 IST)
రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామని బాంబు పేల్చారు.

తాము ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టామని, కాంట్రాక్టర్ల నుంచి 3 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నామని ఓ పట్టణ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా నేత వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని మీడియా ముందు పావని చెప్పడం సంచలనానికి దారితీసింది. ఇంకా పర్సంటేజీలు తీసుకుంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఇంకా మంత్రిగారి ప్రోత్సాహంతోనే తాము కమిషన్లు తీసుకుంటున్నామని.. నిత్యమూ ప్రజాసేవలో ఉండే తమకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తే తప్పేంటని అడిగారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆమె తన పదవికి రాజీనామా సమర్పించారు. కమీషన్ల వ్యవహారంలో ఆమె నోరు జారడంతో పార్టీ పెద్దల నుంచి ఏర్పడిన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణకు శుభదినాలే.. ఆదివారం మాత్రం మాంస భక్షణ చేయకూడదు..