Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయిశివశ్రీ నా బిడ్డ కాదు.. సుమశ్రీ నా భార్య కాదు.. మానవతాదృక్పథంతోనే చేరదీశా: శివకుమార్

నాన్నా నాకు ట్రీట్మెంట్ చేయించండి అంటూ చనిపోయేందుకు కొన్ని రోజుల ముందు లుకేమియా వ్యాధితో బాధపడుతూ సాయి శివశ్రీ అనే బాలిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే శివశ్రీ మరణించింది. ఇం

Advertiesment
Shiva Kumar
, సోమవారం, 29 మే 2017 (14:42 IST)
నాన్నా నాకు ట్రీట్మెంట్ చేయించండి అంటూ చనిపోయేందుకు కొన్ని రోజుల ముందు లుకేమియా వ్యాధితో బాధపడుతూ సాయి శివశ్రీ అనే బాలిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే శివశ్రీ మరణించింది. ఇంకా శివశ్రీ తల్లి సుమశ్రీ.. తన బిడ్డ మరణానికి.. భర్త మాదంశెట్టి శివకుమార్ కారణమని ఆరోపించారు. అయితే ఇటీవల లుకేమియా వ్యాధితో బాధపడుతూ చనిపోయిన చిన్నారి శివశ్రీ తన కుమార్తె కాదని, అలాగే ఆమె తల్లి సుమశ్రీ తన భార్య కాదని మాదంశెట్టి శివకుమార్ ఆరోపించారు.
 
శివశ్రీని సుమశ్రీతో పాటు మరికొందరు కలిసి చంపేశారని శివకుమార్ ఆరోపించారు. సుమశ్రీపై పలు ఆరోపణలు చేస్తూ శివకుమార్ ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న శివశ్రీకి చికిత్స విషయంలో శివకుమార్‌ను డబ్బులు ఇవ్వాలని కోరుతూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది సుమశ్రీ. కానీ విజయవాడలో ప్రస్తుతముంటున్న ఫ్లాట్ ను శివశ్రీ పేరున శివకుమార్ రాసిచ్చాడట 
 
కానీ ఈ ఫ్లాట్‌ను విక్రయించకుండా కొందరు అడ్డుపడడంతో శివశ్రీకి ట్రీట్ మెంట్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని సుమశ్రీ ప్రకటించింది. అయితే శివశ్రీని చంపేశారని శివకుమార్ వీడియో ద్వారా ఆరోపించారు. శివశ్రీని చంపినట్టుగా తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. దీనిపై ఇప్పటికే మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్టు చెప్పారు. త్వరలో హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేస్తానని చెప్పారు.
 
మానవతాథృక్పథంతోనే పాపను పెంచినట్టు శివకుమార్ చెప్పారు. శివశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్‌లో అద్దెకు దిగిందన్నారు. ఆ తర్వాత రూ.8 లక్షల బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్‌లోని కృష్ణకుమార్ వద్దకు వెళ్ళిపోయిందని ఆరోపించారు. దీనిపై తాను ఆనాడు పామర్రు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్టు గుర్తు చేశారు. శివ శ్రీ వైద్యానికి రూ.25 లక్షలను ఖర్చుచేసినట్టు చెప్పారు. అయితే వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 
 
ఇకపోతే.. దుర్గాపురంలో సుమశ్రీతో కలిసి ఉంటున్న కృష్ణకుమార్ అనే వ్యక్తి ఆమెకు మూడో భర్త అని శివకుమార్ తెలిపారు. తన ఫ్లాటులో ఇంతకుముందు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయన్న ఆయన, బొండాం ఉమ అనుచరులు ఆ ఫ్లాట్ కోసం బెదిరింపులకు దిగిన విషయాన్ని గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడనాడు ఎస్టేట్‌ను అమ్మ, చిన్నమ్మ లాగేసుకున్నారు.. 150 మంది గూండాలను పంపించి..?