'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జయంతి జరిపిస్తాం... అఖిలప్రియ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో రాజకీయ నాయకుల్లో మెళకువ వచ్చినట్లుంది. తెల్లదొరలపై సింహస్వప్నంలా తిరగబడ్డ తొలి తెలుగుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ నేపధ్యంలో ఆయన జయంతి వేడుకలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో రాజకీయ నాయకుల్లో మెళకువ వచ్చినట్లుంది. తెల్లదొరలపై సింహస్వప్నంలా తిరగబడ్డ తొలి తెలుగుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ నేపధ్యంలో ఆయన జయంతి వేడుకలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలియజేశారు.
బుధవారం నాడు కర్నూలులో జరిగిన మినీ మహానాడులో అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ... తన తల్లిదండ్రులు చనిపోవటం వల్ల తను మంత్రినయ్యాననీ, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మహానాడులో నా తండ్రి భూమా నాగిరెడ్డి తన చెయ్యి పట్టుకొని నడిపించారనీ, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు నడిపిస్తున్నారని అన్నారు.