Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోశయ్య అల్లుడి కాలేజీలో సచివాలయం?!

రోశయ్య అల్లుడి కాలేజీలో సచివాలయం?!
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:38 IST)
మిలినియం టవర్ లో సచివాలయం ఏర్పాటు కు అంతరాయం ఏర్పడడంతో జగన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం కోసం అడుగులేస్తోందా?... ఉగాది నాటికి అనుకున్నది పూర్తి చేసేయాలని తలపోస్తోందా?..

ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అల్లుడితో డీల్ కుదుర్చుకుందా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు కోసం ప్రభుత్వం మరో 2 భవనాలను పరిశీలించినట్లు తెలిసింది.

అవి రోశయ్య కుటుంబానికి చెందినవి కావడం విశేషం. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోనే ఉంది. విశాఖ నుంచి 20 కి.మీ. దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన 2 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

అందులో ఒకటి పైడా ఇంజనీరింగ్‌ కాలేజీ కాగా.. మరొకటి కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ. సుమారుగా 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. వీటి యజమాని రోశయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్‌.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పేరుకుపోవడం, ప్లేస్‌మెంట్స్‌ ఆధారంగా విద్యార్థులు కాలేజీలను ఎంపిక చేసుకోవడంతో అడ్మిషన్లు బాగా తగ్గిపోయి నాలుగేళ్ల క్రితమే కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మూతపడింది.

ప్రస్తుతం పైడా ఇంజనీరింగ్‌ కళాశాల మాత్రమే నడుస్తోంది. అందులో కూడా రెండేళ్ల నుంచి అడ్మిషన్లను నిలిపివేశారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోర్సులు పూర్తయిపోతే దానిని కూడా మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది.

విజయసాయిరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతంసవాంగ్‌ రెండ్రోజుల కింద విశాఖ వచ్చారు. ఈ భవనాలన్నింటినీ పరిశీలించి వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

72వ రోజుకి రాజధాని రైతుల ఆందోళనలు