Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా ఎమ్మెల్యే కారుపై సొంత పార్టీ నేతలే చెప్పులతో దాడి...

slipper attack on mla
, మంగళవారం, 2 మే 2023 (09:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కేవలం ప్రజలే కాదు.. ఆ పార్టీ నేతలు, శ్రేణులు కూడా వైకాపా ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైకాపా ఎమ్మెల్యే కారుపై సొంత పార్టీ నేతలే చెప్పులతో దాడి చేశారు. ఈ అవమానం ఎమ్మెల్యే శంకరనారాయణకు సోమవారం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణ తన అనుచరులతో కలిసి సోమందేపల్లి మండలం చాకలూరు పంచాయతీ పరిధిలోని గుడ్డంనాగేపల్లి గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆ మార్గంలోని ఈదులబళాపురం గ్రామ వాసులు, వైకాపా కార్యకర్తలు కలిసి... హిందూపురం ప్రధాన రహదారిపై రేణుకానగర్‌ మలుపు వద్ద ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు.
 
గ్రామానికి చెందిన వైకాపా అసమ్మతి నాయకుడు నాగభూషణ రెడ్డి, మరికొందరు... నాలుగేళ్లుగా ఏం అభివృద్ధి చేశారు? అని శంకరనారాయణను నిలదీసేందుకు యత్నించారు. హిందూపురం ప్రధాన రహదారి నుంచి రేణుకానగర్‌ వరకు రహదారి అధ్వానంగా ఉందని.. రాకపోకలకు అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఈదులబళాపురంలో మురుగుకాలువలు, సిమెంటు రోడ్లు ధ్వంసమైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గన్‌మన్లు, పోలీసులు... నిరసనకారులను పక్కకు లాగి పడేశారు. ఈక్రమంలో గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.
 
గతంలో ఐదు నెలల పాటు గ్రామానికి రేషన్‌ బియ్యం రాకుండా చేసి... పేదల నోటికాడ అన్నం లాక్కున్న దొంగ అంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కారు దిగకుండా అలాగే ముందుకు కదిలారు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు కారుపైకి చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయాక నాగభూషణరెడ్డి సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి సోమందేపల్లి స్టేషన్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఈ-మెయిల్ బూటకం..తిరుమలలో ఉగ్ర సంచారం లేదు.. టీటీడీ