ఏపీలో సంక్రాంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పందెం నిర్వహించే పందెం రాయుళ్లకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కోడిపందాలలో విషాదం తప్పలేదు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో పందెంకోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే వ్యక్తి మృతి చెందాడు.
కత్తి మోకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడిక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ లోపే మరణించారని వైద్యులు చెప్పారు.