Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరమ శివుని తాకిన గంగమ్మ

పరమ శివుని తాకిన గంగమ్మ
విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (10:32 IST)
ఏటా కార్తీక మాసంలో ఈ అద్భుతం  జరుగుతుంది. సంగమేశ్వరంలో సంగమేశ్వర ఆలయంలో ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూడొచ్చు. ఏటా కార్తీక మాసంలో గంగమ్మ పరమేశ్వరుని తాకుతుంది. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం బద్వేలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర ఆలయంలో ఈ విశేషం చోటు చేసుకొంది.


సంగమేశ్వర ఆలయాన్ని మూడు ఏరులైన పిల్లేరు, వడ్డేరు, కల్లేరు సంగమ స్థానంలో పరశురాముడు ప్రతిష్టించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుని వరం కారణంగా గంగమ్మ  ప్రతి కార్తీకమాసం  మూడు రోజుల పాటు శివుని తాకి తన్మయత్వoతో పరవశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 
ఈ ఆలయంలో నీరు భూమి నుంచి ఊటలాగా పైకి  ఊరుతుందని స్థానికులు తెలియజేస్తున్నారు.


ఏ శివాలయంలో జరగని విధంగా ఇక్కడ ఈ దృశ్యం చోటు చేసుకొంటుంది. ప్రతి ఏటా ఇలానే ఇక్కడ జరుగుతుంది. ఆలయ అర్చకులు ఆ నీటిలోనే శివునికి పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చి, స్వామి వారిని ఏమి కోరుకొన్నా  జరుగుతుందని, ఏల్నాటి శని సైతం ఈ ఆలయంలో శివుని దర్శనంతో ఉపసమనం కలుగుతుందని భక్తుల అంచలంచల నమ్మకం. ఈ విశేషాన్ని కనులారా చూసేందుకు భక్తులు రామేశ్వరానికి వస్తున్నారు. కార్తీక మాసం పుణ్యతిధి అని, ఈ సమయంలో స్వామి వారి దర్శనం మహాభాగ్యమని భక్తులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో పోరాటానికి సిద్ధమైన వైఎస్ షర్మిల... 72 గంటల పాటు..