ఇసుక మాఫియా డాన్‌లు లొంగిపోయారు...
						
		
						
				
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగళపాళెంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్న 13 మందిలో ఐదుగురు నిందితులు పోలీసులకు  లొంగిపోయారు. కీలక వ్యక్తిలో ఒకరైన చిరంజీవి నాయుడు శ్రీకాళహస్తి డిఎస్పీ ఎదుట లొంగిపోయారు.
			
		          
	  
	
		
										
								
																	చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగళపాళెంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్న 13 మందిలో ఐదుగురు నిందితులు పోలీసులకు  లొంగిపోయారు. కీలక వ్యక్తిలో ఒకరైన చిరంజీవి నాయుడు శ్రీకాళహస్తి డిఎస్పీ ఎదుట లొంగిపోయారు. మరో ఇసుక మాఫియా డాన్ ధనంజయ నాయుడు అన్న చిరంజీవి నాయుడు. చిరంజీవితో పాటు భాస్కర్ నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, వెంకటరత్నం నాయుడు, రామానాయుడులు కూడా పోలీసులకు లొంగిపోయారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఐదుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మరో 8 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఇసుక మాఫియాలో కీలక వ్యక్తి మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అనుచరుడిగా ఉన్న ధనంజయనాయుడు మాత్రం ఇంకా అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.