సాక్షి టీవీకి బ్రేక్... ముద్రగడ ఎపిసోడ్ అయ్యేవరకూ... కావలిస్తే కంప్యూటర్‌లో చూస్కోండి...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీకి బ్రేక్ పడింది. ఈ ఛానల్ ప్రసారం కాకుండా, ఎం.ఎస్.ఓలకు అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ నేపథ్యంలోనే సాక్షి ఆపివేశారని తెలుస్తోంది. ఈ ఎ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీకి బ్రేక్ పడింది. ఈ ఛానల్ ప్రసారం కాకుండా, ఎం.ఎస్.ఓలకు అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ నేపథ్యంలోనే సాక్షి ఆపివేశారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ పూర్తయ్యే వరకు సాక్షి ఛానల్ పైన అనధికారికంగా వేటు వేశారని పేర్కొంటున్నారు. ముద్రగడ నిరాహార దీక్షను గంట గంటకు సాక్షి చానల్ లైవ్ కవరేజి ఇస్తోంది. దీనిని అడ్డుకునేందుకు ఎంఎస్.ఓ.ల ద్వారా ఛానల్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఒక్క విజయవాడ, గుంటూరులోనే కాదు వైజాగ్, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా సాక్షి చానెల్ ప్రసారాలను నిలిపివేశారు. ఇదంతా ప్రభుత్వం తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఎమ్ఎస్ఓలపై ఒత్తిడితో చేయించిందని వైకాపా విమర్శిస్తోంది. కాగా ప్రభుత్వం కూడా ఈ పనిచేయించినందుకు ఏమాత్రం వెరవడం లేదు.
తుని వంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు... ముద్రగడ వర్గీయులు ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు ఈవిధంగా చేశామంటూ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. అయితే, సాక్షి ఛానల్ నెట్ ద్వారా ప్రసారం కానుండటంతో... కావాల్సిన వారు కంప్యూటర్లలో నెట్ ద్వారా వీక్షిస్తున్నారు.