Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

పచ్చిగడ్డి కోసం చెరకుతోటలోకి వెళితే... ఉన్మాది ఏం చేశాడో తెలుసా?

చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో దారుణం జరిగింది. చెరకుతోటలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లిన ఓ మహిళను ఓ ఉన్మాది చెరబట్టి బ్లేడుతో గొంతుకోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
sadist attack
, గురువారం, 27 జులై 2017 (08:51 IST)
చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో దారుణం జరిగింది. చెరకుతోటలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లిన ఓ మహిళను ఓ ఉన్మాది చెరబట్టి బ్లేడుతో గొంతుకోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని పన్నూరు ఆదిఆంధ్రవాడకు చెందిన పరశురాం అనే వ్యక్తి భార్య దేవి(34). ఈమె పచ్చిగడ్డి కోసం ఇంటికి సమీపంలోనే ఉన్న చెరకుతోటలోకి ఒంటరిగా వెళ్లింది. ఈమెను పన్నూరు దళితవాడకు చెందిన కుమార్‌(27) అనే ఉన్మాది గమనించి ఆమెకు కనిపించకుండా వెంబడించాడు. ఆ తర్వాత ఆమె చెరకుతోటలో పచ్చిగడ్డి కోస్తుంటే.. వెనుకవైపు నుంచి ఆమెపై బ్లేడుతో దాడి చేశారు. 
 
దీంతో ఆమె ప్రాణభయంతో ఒక్కసారి కేకలు వేయడంతో కుమార్ పారిపోయాడు. అయితే, ఈ ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన దేవిని చుట్టుపక్కలవారు గమనించి నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాస్పత్రికి తీసుకెళ్లారు. 
 
కాగా, మూడేళ్ళ క్రితం సికిందరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ళ చిన్నారిని కత్తితో గొంతుకోసి హత్య చేసిన కేసులో కుమార్ ప్రధాన ముద్దాయి. ఈ కేసులో అతనికి జైలుశిక్ష కూడా పడింది. అయితే, ఇపుడు జైలు నుంచి విడుదల చేశారా లేకపోతే జైలునుంచి తప్పించుకున్నాడా తెలియడం లేదు. 
 
తాజాగా దేవిపై జరిగిన దాడితో కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు మాత్రం ఎపుడు ఎక్కడ తమపై దాడి చేస్తాడోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక నాటకాలు వేరే ఉంటే ఆడుకోండి.. నియోజక వర్గాల పెంపు జరగదన్న కేంద్రం