Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపాను గెలిపిస్తే విశాఖను కూడా రక్షించుకోలేం... : సబ్బం హరి

Advertiesment
వైకాపాను గెలిపిస్తే విశాఖను కూడా రక్షించుకోలేం... : సబ్బం హరి
, బుధవారం, 10 మార్చి 2021 (08:16 IST)
గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీకి బుధవారం జరిగే ఎన్నికల్లో అధికార వైకాపా అభ్యర్థులను గెలిపిస్తే... భవిష్యత్తులో విశాఖను కూడా రక్షించుకోలేమని మాజీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఎన్నికలలో వైకాపాను గెలిపిస్తే మరింతగా రెచ్చిపోయి విశాఖను కూడా ఏదో ఒకటి చేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అందువల్ల మున్సిపల్ ఎన్నికలు అందివచ్చిన అవకాశం అని... ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే... విశాఖను రక్షించుకోవడం కష్టమని నగర ప్రజలను ఆయన హెచ్చరించారు. "మీరింకా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండకండి. మీరే గనుక రేపటి ఎన్నికల్లో కులానికో, మరేదానికో లొంగిపోతే.. విశాఖ కూడా మమ్మల్ని గెలిపించిందని వైసీపీ వాళ్లు విర్రవీగుతారు. ఇంకెవడూ మాట్లాడటానికి లేదు అంటారు. 
 
మీరెన్ని చెప్పినా... ప్రజలు నాకే ఓటేశారని చెప్పి... ఇంకా అరాచకాలకు పాల్పడే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసినా, పోలవరం ఎత్తు తగ్గించినా.. ఏది చేసినా తమకేం కాదంటారు. ఈ ఎన్నికల్లో జనం తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాలి. 
 
ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోతే... విశాఖను రక్షించుకోవడం కష్టం. మీ తీర్పు ద్వారా వాళ్లకు కళ్లు తెరిపించాలి. ఇది జరిగిన తర్వాత నెత్తినోరు కొట్టుకున్నా ఇంకేమీ ఉండదు. విశాఖ పట్టణాన్ని రక్షించుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఇదే నా అభ్యర్థన' అని ఆయన ఉద్వేగానికి గురయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుస్థిరమైన వ్యవసాయం దిశగా మరో ముందడుగు వేసిన వేకూల్‌