Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయలసీమలో కులపిచ్చి ఎక్కువ... కర్మగాలి రెడ్లందరూ ఇక్కడే ఉన్నాం: జేసీ దివాకర్

ముఖ్యమంత్రి చంద్రబాబుపైవిమర్శలు గుప్పిస్తూ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన అన్న, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఖండించారు.

Advertiesment
రాయలసీమలో కులపిచ్చి ఎక్కువ... కర్మగాలి రెడ్లందరూ ఇక్కడే ఉన్నాం: జేసీ దివాకర్
, మంగళవారం, 3 జనవరి 2017 (05:14 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబుపైవిమర్శలు గుప్పిస్తూ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన అన్న, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఖండించారు. సోమవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. 'మావాడు జగన్‌ ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. ఎవడైనా పట్టిసీమను వ్యతిరేకిస్తాడా?' అని ఎంపీ జేసీ అన్నారు. 'రాయలసీమలో కులపిచ్చి ఎక్కువ. కర్మగాలి రెడ్లందరూ ఇక్కడే ఉన్నాం. మావాడంటూ రెడ్లంతా జగన్‌ వెనుక వెళ్తున్నారు. ఇదిగో.. ఈ వేదిక ముందు కూర్చున్న రెడ్లు కూడా మావాడని వెళ్లి అక్కడ ఏమీ లేదని ఇక్కడికొచ్చేశారు. కులం కూడు పెడుతుందా..! అని ప్రశ్నించారు. 
 
పిచ్చి కాకపోతే చంద్రబాబు ఏ కులమని సీమను అభివృద్ధి చేస్తున్నారు' అని అన్నారు. మూడు తరాలు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నామని, కానీ ఆ మహాతల్లి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తమకు సరైన బహుమతి ఇచ్చిందని జేసీ దివాకర్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.  
 
పైగా, విభజన తర్వాత జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని రాయలసీమలో అందరూ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, అనుభవజ్ఞుడు, పటిష్ట నాయకత్వం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమని టీడీపీలో చేరాను. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రముఖ ఇంజనీర్‌ శివరామకృష్ణ తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారుచేస్తే తెల్లకాగితం మీద రెండు గీతలు గీశాడనుకున్నాం. నికర జలాల కోసం ఆందోళన చేశాం. నికరజలాలంటే తెల్ల జలాలు.. వరద జలాలంటే నల్ల జలాలనుకుని పోరాటాలు చేశాం. రామారావు ముందుచూపు ఏపాటిదో ఈ ప్రాజెక్టులను చూస్తే తెలుస్తోంది’ అని జేసీ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్మభూమి వేదికగా కొత్తగా మూడున్నర లక్షల మందికి పింఛన్ల పంపిణీ....