Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిటైర్డ్ ఆర్మీ జవాన్.. విహారయాత్ర పేరుతో కుమార్తెపై అత్యాచారం.. మైనర్‌గా ఉన్నప్పటినుంచే...

అతను పేరుకు మాత్రం రిటైర్డ్ జవాను. రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య చనిపోయింది. దీంతో ఆమెకు పుట్టిన బిడ్డతో తన లైంగికవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గోహరపల్లె గ్రామానికి చెందిన బ

Advertiesment
Rtd Army Jawan
, బుధవారం, 5 జులై 2017 (12:27 IST)
అతను పేరుకు మాత్రం రిటైర్డ్ జవాను. రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య చనిపోయింది. దీంతో ఆమెకు పుట్టిన బిడ్డతో తన లైంగికవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గోహరపల్లె గ్రామానికి చెందిన బొమ్మినేని చిన్నశేషయ్య అనే వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ జవాను. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వెంకటమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నతనంలో ఉన్నపుడే వెంకటమ్మ చనిపోయింది. అనంతరం లక్ష్మీకుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తెను లక్ష్మీకుమారి సూటిపోటీ మాటలు అంటుండడంతో చిన్నశేషయ్య తన కుమార్తెను కడప జిల్లా పోరుమామిళ్ళలో ఓ స్కూల్‌లో చేర్చి.. అక్కడే ఉన్న హాస్టల్‌లో చేర్చాడు. 
 
అయితే, కుమార్తెను చూసేందుకు ప్రతి ఆదివారం హాస్టల్‌కు వెళ్లేవాడు. ఆ తర్వాత కుమార్తెను బయటకు తీసుకెళ్లి శారీరకవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళకు ఈ విషయం ఆమె అవ్వతాతకు తెలిసింది. దీంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నశేషయ్య తన కుమార్తెను తీసుకుని వచ్చి కొమరోలులో తన రెండో భార్య పిల్లలతో ఇంట్లో ఉండసాగారు.
 
ప్రస్తుతం ఆ యువతికి 22 యేళ్లు. అయినప్పటికీ కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడు ఆ కామాంధుడు. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన ఆ యువతికి కడుపు నొప్పి రావడంతో గిద్దలూరు ఆర్మీ వైద్యశాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు. అక్కడ వైద్యురాలికి ఆ యువతి తన గోడును వెల్లబోసుకోగా, ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నశేషయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితురాలితో వైద్యుడి కామకేళి... వీడియో తీసిన నర్సు.. తర్వాత ఏం జరిగింది?