Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిలో రాజధాని నిర్మాణం.. 53,478 ఎకరాలలో అత్యంత సుందరంగా..?

అమరావతి నగరంలో 27 పట్టణాలు ఉండేవిధంగా సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రాజెక్ట్ నివేదిక రూపొందించింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 24 రెవెన్యూ గ్రా

అమరావతిలో రాజధాని నిర్మాణం.. 53,478 ఎకరాలలో అత్యంత సుందరంగా..?
, సోమవారం, 19 డిశెంబరు 2016 (14:51 IST)
అమరావతి నగరంలో 27 పట్టణాలు ఉండేవిధంగా సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రాజెక్ట్ నివేదిక రూపొందించింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 53,478 ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించనున్నారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలోమీటర్ల ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుంది. 
 
రాజధానిలో వివిధ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ 9 నగరాలు నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి ఎకరాలలో రెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దాదాపు 28 వేల ఇళ్లు, లక్ష మంది జనాభా ఉంటారు. ఒక్కో పట్టణంలో నాలుగు రహదారులు నిర్మిస్తారు. వాటిని పట్టణ సరిహద్దులలో నిర్మించే ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తారు. ప్రతి పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ, ఒక మెట్రో స్టేషన్ నిర్మిస్తారు.
 
ఒక్కో క్లస్టర్ నిర్మాణంలో 15 నుంచి 30 ఎకరాల ప్రదేశంలో ఉంటుంది. ఇందులో మూడు వందల నుంచి 8 వందల కుటుంబాల వరకు ఉంటాయి. జనాభా 1500 నుంచి మూడు వేల వరకు ఉంటారు. కృష్ణా నది ఒడ్డున ఒక క్రమ పద్దతిలో వాణిజ్య కేంద్రాలను(భవనాలు) నిర్మించాలని ప్రతిపాదించారు. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో విశాలమైన రోడ్లు నిర్మిస్తారు.
 
జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాలు పోయినా సరే.. అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం: ప్రధాని నరేంద్ర మోడీ