ఏపీ మంత్రి ఆర్కే రోజా తనదైన పంచ్ డైలాగులతో వైసిపి ప్లీనరీకి జోష్ నింపారు. ఆద్యంతం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలతో ముంచెత్తారు. సీఎం జగన్ ఓ పులి అనీ, ఈ పులి ఆశయం కోసం వేటాడుతుందంటూ పంచ్ విసిరారు. సోనియాను గడగడలాడించి, చంద్రబాబుకి వెన్నులో వణుకుపుట్టించిన లీడర్ జగన్ అని అన్నారు.
కాన్ఫిడెన్సుకి కటౌట్ వేస్తే జగన్ మోహన్ రెడ్డిలా వుంటుందనీ, ఈ కటౌట్ చూస్తే ప్రతిపక్షాల ఫీజులు ఎగిరిపోతాయని అన్నారు. జగన్ కంటెంట్ చూస్తే ప్రత్యర్థుల ప్యాంట్లు తడిచిపోతాయంటూ పంచ్ వేసారు.
పార్టీ ఏర్పాటు చేసిన పుష్కర కాలంలో తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేసిన ఘనత వైసిపిదేనన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారనీ, ఆడబిడ్డల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. చివరిగా అమ్మను మించిన దైవంలేదు.... అన్నను మించిన ధైర్యం లేదంటూ ఫినిషింగ్ పంచ్ తో ప్రసంగం ముగించారు. మొత్తమ్మీద ప్లీనరీలో తనదైన స్టైల్లో రోజా ప్రసంగించారు. రోజా ప్రసంగానికి నాయకుల నుంచి కార్యకర్తల వరకూ మంచి స్పందన వచ్చింది.