Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు బ్లూ ఫిల్మ్‌లో నటించారా? రోజాకు ప్రశ్న.. సమాధానం ఏం చెప్పారు?!

Advertiesment
Roja
తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో జంప్ అయిన రోజా.. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే. అయితే ఆమె ప్రస్తుతం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలతో ఏడాది పాటు సస్పెన్షన్‌ గురై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టిన సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలకు మెగా వర్గపు రాజకీయ నాయకులు ‘మాటలతో’ కాకుండా ‘వీడియో’లతో బదులిచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వారాంతపు కార్యక్రమాలు నిర్వహించే ఓ విలేఖరి రోజాను సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. ‘మీరు బ్లూ ఫిల్మ్ నటించారా?’ అంటూ విలేఖరి అడిగాడు. ఈ ప్రశ్నకు అవాక్కైన రోజా, ‘ఎలా అడుగుతారు ఇలాంటి ప్రశ్నలను…? బాధేస్తుంది… చచ్చిపోవాలనిపిస్తుంది…’ అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ ప్రశ్నకు సంబంధించిన ఇంటర్వ్యూ ఆదివారం రాత్రి టీవీలో ప్రసారం కానుంది. 
 
అయితే ఆ విలేక‌రి త‌న మొబైల్ ఫోనోలో రోజాకు ఏదో చూపించారు. బ‌హుశా ఆ వీడియో రోజాకు సంబంధించిందిగానే క‌నిపిస్తోంది. దీనిపై ఆదివారం ప్రసారమయ్యే ఆ టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ రానుంది. అయితే ఈ ప్ర‌శ్న‌పై మ‌హిళా సంఘాలు మండిప‌డుతున్నాయి. ఓ మ‌హిళా ఎమ్మెల్యేను ఓ విలేక‌రి అడ‌గాల్సిన ప్ర‌శ్నేనా ఇది అని ప‌లువురు ఆ విలేక‌రితో పాటు ఆ ఛానెల్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
నైతిక విలువ‌లు ప‌క్క‌న పెట్టి టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకోవ‌డానికి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వారు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబధించిన ప్రోమోలో ఈ విషయం స్పష్టంగా కనపడింది.. అయితే ఈ ప్రోమో వీడియోని కొద్దిసేపటికి క్రితం ఆ చానల్ వారు యూట్యూబ్ నుండి డిలిట్ చేయటం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu