Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌ట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్

Advertiesment
Reverse tendering
, గురువారం, 17 అక్టోబరు 2019 (06:40 IST)
ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలన్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే అని ఆ నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంత గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎపి టిడ్కోలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించిన తీరుకు ఫుల్ స్టాప్ పెట్టే చర్యల్లో భాగంగా అప్పటికే ప్రారంభం కాని పనులను రద్దు చేయడం, కొనసాగుతున్న పనులను  పునః సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ్ రెడ్డి గారు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టిడ్కో ఆధ్వర్వంలోని వివిధ గృహ నిర్మాణ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల పనుల పురోగతి, స్థితిగతులు సమీక్షించిన అనంతరం, ఈ పనులకు కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ఉత్తర్వులపై మంత్రి బొత్స సత్యనారాయణ సంతకం చేశారు. రివర్స్ టెండరింగ్‌లో అనుసరించాల్సిన విధి విధానాలను మంత్రి  ఖరారు చేశారు.

ఈ నిర్ణయంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గి ఖజానాపై భారం తగ్గడంతో పాటు, ఆయా పథకాల్లోని లబ్ధిదారులపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడి... ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ ప్రతిపాదన