Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఎమ్మెల్యేలంతా వ్యభిచారులు.. వారు వ్యభిచార కొంపలు నడిపే ఓనర్లు.. రేవంత్ రెడ్డి

తెలంగాణలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప

Advertiesment
Revanth Reddy
, బుధవారం, 29 మార్చి 2017 (11:14 IST)
తెలంగాణలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారిన ఎమ్మెల్యే లంతా వ్యభిచారులు,వాళ్లను చేర్చుకునేది ఆ వ్యభిచార కొంపలు నడిపే యజమానులు.. అని రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
కానీ ఈ మాటలను రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారా? అనేది ఓ వైపుంటే.. రేవంత్ కామెంట్స్ ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించినవి కూడా తీసుకోవచ్చు కదా అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీడీపీ నుంచే టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఎక్కువైనాయి. ఈ కారణంతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేశారనుకోవచ్చు. 
 
కానీ తెలంగాణ తరహాలోనే పార్టీ ఫిరాయింపులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగిన తరుణంలో రేవంత్ రెడ్డి బాబును కూడా అదే మాట అన్నాడని చెప్పుకోవచ్చు కదాని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియోకు షాక్.. టెలినార్ స్పెషల్ ప్లాన్.. 80 పైసలకే 1 జీబీ డేటా