Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లిని ఇంటి ముందు ఎర్రటి ఎండలోకి నెట్టేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్... (Video)

ఆయనో ప్రధానోపాధ్యాయుడిగా పాఠాలు బోధించి రిటైర్డ్ అయ్యారు. ఆయన సర్వీసులో ఉండగా విద్యార్థులకు ఎలాంటి విద్యాబుద్ధులు చెప్పాడో కానీ.. ఆయన మాత్రం తన కన్నతల్లిని ఇంటి నుంచి ఎర్రటి ఎండలో వదిలిపెట్డాడు. 90 యే

కన్నతల్లిని ఇంటి ముందు ఎర్రటి ఎండలోకి నెట్టేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్... (Video)
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (13:39 IST)
ఆయనో ప్రధానోపాధ్యాయుడిగా పాఠాలు బోధించి రిటైర్డ్ అయ్యారు. ఆయన సర్వీసులో ఉండగా విద్యార్థులకు ఎలాంటి విద్యాబుద్ధులు చెప్పాడో కానీ.. ఆయన మాత్రం తన కన్నతల్లిని ఇంటి నుంచి ఎర్రటి ఎండలో వదిలిపెట్డాడు. 90 యేళ్ళ వయసులో ఎటూ వెళ్లలేని ఆ వృద్ధురాలు.. కుమారుడి ఇంటి గడపకే పరిమితమైంది. ఎర్రటి ఎండను తట్టుకోలేక హాహాకారాలు పెడుతున్నా.. ఆ కన్నకొడుకు మాత్రం ఏమాత్రం కనికరం చూపించలేదు. కానీ, ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారంతో కలెక్టర్ స్పందించి సంబంధింత అధికారులకు ఆదేశాలివ్వగా, వారు వచ్చి ఆ వృద్ధురాలిని కాపాడారు. మంచిర్యాలలోని హైటెక్ సిటీ కాలనీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఈ ప్రాంతానికి చెందిన వెంకట్రాం నర్సయ్య. ఈయనకు భార్య, తల్లి, కుమార్తె, ఓ కుమారుడు ఉన్నాడు. వీరంతా సొంత ఇంట్లోనే ఉంటున్నారు. నర్సయ్య ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఈయన తల్లి రాధాదేవి. వయసు 85 యేళ్లు. ముసలితనంలో బాధపడుతున్న ఆమెను కొడుకు, కోడలు, మనమరాలు అస్సలు పట్టించుకోరు. ఆమెను ఇంటి వెనుక వైపు ఉన్న చిన్న వరండాలో పడుకోబెట్టి వదిలేశారు. అక్కడే ఉన్న కొళాయి దగ్గర ఆమె నీళ్లు పట్టుకుని తాగుతూ, కొడుకు పెట్టే రెండు ముద్దలు తింటూ జీవనం సాగిస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో లేవలేని పరిస్థితుల్లో కాల కృత్యాలు కూడా అక్కడే చేస్తోంది. ఎండలు పెరిగి... వరండాలోకి వేడి వస్తుండటంతో తట్టుకోలేక ఏడుస్తున్నా కూడా కొడుకు మనసు కరగడం లేదు. ఆమె అరుపులు చుట్టుపక్కల వారు విని... పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పందించకపోవడంతో... నేరుగా కలెక్టర్‌కు ఆమె ఫోటోలు తీసి పంపించారు. 
 
కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వచ్చి ముసలి అవ్వను ఆసుపత్రికి తరలించారు. వచ్చిన అధికారులతోనూ నర్సయ్య కుటుంబం గొడవ పెట్టుకుంది. తమ కుటుంబ వ్యవహారమని జోక్యం చేసుకోవద్దంటూ మాట్లాడింది. దీంతో వారిని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈయనపై వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చదివింది.. పదో తరగతి.. 50 రోజుల్లో రూ.6.3లక్షలు స్వాహా.. ముగ్గురికి కుచ్చుటోపీ.. ఎలా?