Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనందయ్య మందు తీసుకున్న రిటైర్డ్ హెచ్ఎం కోటయ్య మృతి

ఆనందయ్య మందు తీసుకున్న రిటైర్డ్ హెచ్ఎం కోటయ్య మృతి
, సోమవారం, 31 మే 2021 (11:07 IST)
కరోనాకు విరుగుడుగా కృష్ణపట్నం ఆనందయ్య మందు ఉపకరిస్తుందని జోరుగా ప్రచారం సాగింది. ఈ మందు తీసుకున్నాక కరోనాను నియంత్రించవచ్చునని వార్తలు వచ్చాయి. ఈ మందుపై పరిశోధన కూడా శరవేగంగా జరుగుతోంది. ఆనందయ్య పంపిణీ చేసిన ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం పూర్తి చేసింది. ఆయుష్ కమిషనర్ రాములు అక్కడ పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. ల్యాబ్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణ పట్నం ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకుంటున్నట్లుగా చెప్పిన రిటైర్డ్ హెచ్ఎం కోటయ్య మృతి చెందారు. కొద్ది రోజుల కిందట ఆనందయ్య మందుకు క్రేజీ తీసుకొచ్చింది ఈయనే కరోనాతో గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 
 
అంతకుముందు కరోనా మందు తీసుకోవడం ద్వారా తనకు మందు బాగా పనిచేసిందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.  కాగా ఆయన ఆరోగ్యం క్షీణించడం.. ఇవాళ ఆయన మృతి చెందడంతో ఆనందయ్య మందుపై కాస్త సందేహాలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మరోసారి క్షీణించింది. 
 
ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని ప్రచారం జరిగింది. అయితే, నిన్న కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ చనిపోవడంతో ఆనందయ్య మందుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాయిగా జీవించాం.. ఈటల రాజేందర్ భార్య