చికెన్ ధరలకు రెక్కలొచ్చాయ్.. రానున్న రోజుల్లో కిలో కోడి మాసం ధర రూ.200?
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. చికెన్ ధరలు మాత్రం దిగి రావట్లేదు. ఎండాకాలం చికెన్‌ను మాంసాహారులు ఎక్కువగా తీసుకోరు. దీంతో చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది చికెన్ ధరలు తగ్గలేదు సరి
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. చికెన్ ధరలు మాత్రం దిగి రావట్లేదు. ఎండాకాలం చికెన్‌ను మాంసాహారులు ఎక్కువగా తీసుకోరు. దీంతో చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది చికెన్ ధరలు తగ్గలేదు సరికదా.. అమాంతం పెరిగిపోయాయి. వారం రోజుల క్రితం వరకు కిలో చికెన్ లైవ్ ధర రూ.100 ఉండగా, ఇప్పు డు రూ.130కు పెరిగింది. కిలో కోడిమాంసం ధర రూ.120 వరకు ఉండగా, ఒక్కసారిగా రూ.170కు పెరిగింది.
అదేవిధంగా వేసవి ప్రారంభం కావడంతో ఇక ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతాయని కోళ్లఫారాల ఓనర్లు అంటున్నారు. ఎండ తీవ్రతను అవి తట్టుకోలేవని వారు చెప్తున్నారు. సాధారణంగా ఒక షెడ్‌లో 1000 పిల్లలు పెంచాల్సి ఉండగా, ప్రస్తుత వేసవి నేపథ్యంలో 600 నుంచి 700 పిల్లలు పెంచడం సాధ్యమవుతుందని చెప్తున్నారు.
దీంతో కోళ్లు సంఖ్య తగ్గడంతోపాటు నిర్వహణ వ్యయం పెరుగుతుందని వాపోతున్నారు. వీటితోపాటు కోళ్లు దాణా ధరలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో కిలో కోడి మాంసం ధర రూ.200 దాటినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు అంటున్నారు.