Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రికార్డు సమయంలో పాత వంతెనను పునర్ నిర్మాణం

రికార్డు సమయంలో పాత వంతెనను పునర్ నిర్మాణం
, శుక్రవారం, 8 మే 2020 (21:59 IST)
విజయవాడ డివిజన్లో ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో పాత వంతెనను 8 గంటల రికార్డు సమయంలో ఒంగోల్ - కరావాడి విభాగం మధ్య డౌన్-లైన్లో ప్రీ-కాస్ట్ ఆర్సిసి బాక్స్లతో నిర్మాణం పూర్తి చెయ్యడం జరిగింది. 

విజయవాడ డివిజన్ పరిధిలోని పాత శిధిలావస్థలో ఉన్న రాతి వంతెనను ప్రీ కాస్ట్ ఆర్సిసి (రీఇన్ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్) బాక్సులతో కిలో  నెం.  588 డౌన్ మెయిన్ లైన్లో నిన్న ( 2020 మే, 07 వ తేదీ) విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 

వంతెనను మార్చడానికి వీలుగా నిన్న 07:30 - 15:30 గంటల మధ్య డౌన్ లైన్లో 8 గంటల మెగా బ్లాక్ లతో కూడి పనులు చేపట్టేందుకు చర్యలు విజయవంతం గా పూర్తి.  దీనితో డివిజన్ ఎదుర్కొంటున్న 5 ప్రధాన వంతెన బ్లాక్లు లాక్డౌన్ సమయంలో రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తయ్యాయి.
 
మూడు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల క్రేన్లు, 4 ప్రోక్లెయినర్లు, 2 పవర్ బ్రేకర్లు, 4 టిప్పర్ లారీలు, టవర్ కార్ పరికరాలు మరియు 20 మంది కనీస సిబ్బంది  శ్రమను ఉపయోగించి 8 గంటల రికార్డు సమయంలో సమీకరించడం ద్వారా  రైలు రాకపోకలు కి ఎటువంటి అంతరాయం కలగకుండా పనిని  పూర్తీ చేశామని సంజీవ్ కుమార్, డివిజనల్ ఇంజనీర్, సౌత్, విజయవాడ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపారు.
  
ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, విధుల్లో భాగస్వామ్యం అయిన కార్మికుల్ని  క్షుణ్ణంగా పరీక్షించడం, వారికి పిపిఇలు, శానిటైజర్లు అందించామన్నారు.  పని సమయంలో భౌతిక దూరాన్ని  ఖచ్చితంగా పాటించడం ద్వారా అన్ని భద్రతా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.

తద్వారా డివిజన్ పరిధిలో రికార్డు సమయంలో ప్రధాన ట్రాక్లు మరియు వంతెన మరమ్మతులను నిర్వహించగలిగామన్నారు. ఇటువంటి పనులు సాధారణ రోజుల్లో జరిపితే  ఈ ప్రధాన మార్గంలో  200 కంటే ఎక్కువ రైళ్ల సేవల కదలికలను ప్రభావితం అవుతాయని తెలిపారు.

ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చెయ్యడంతో , విజయవాడ డివిజన్  నాలుగు ప్రధాన వంతెన బ్లాక్లు పూర్తయ్యాయన్నారు.  సిగరాయకొండ-టంగూటూర్ మరియు రాజమండ్రి-విశాఖపట్నం సెక్షన్ మధ్య రెండు వంతెనలు, మరియు విజయవాడ యార్డ్ వద్ద సిజర్స్ క్రాస్ఓవర్ను పిసిసి స్లీపర్లతో భర్తీ చెయ్యగలిగామన్నారు.
 
విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్  పి.శ్రీనివాస్  కోవిడ్19 లాక్డౌన్ కాలంలో ఇలాంటి కీలకమైన పనులు చేసినందుకు ఇంజనీరింగ్ బృందాన్ని అభినందించారు. ఈ సమస్యాత్మక సమయాల్లో కూడా సానుకూలంగా స్పందించి ముందుకు సాగడం మరియు కొత్త , పాత వంతెనలను ఏర్పాటు చేయడం ద్వారా డివిజనల్  బృందం అద్భుత ప్రదర్శనపై చూపడం పట్ల  ఆనందాన్ని, ఉద్యోగుల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. 

రైలు కార్యకలాపాలను ప్రభావితం చేయకుండా రికార్డు సమయంలో ప్రధాన మౌలిక సదుపాయాల కు చెందిన పనులను ప్రారంభించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కృషి మరియు అంకితభావాన్ని భవిష్యత్ కార్యాచరణ ఒక దిశా నిర్దేశంగా అధికారులు, సిబ్బంది నిలుస్తున్నారని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శునకానికి ఐపీఎస్ సెల్యూట్.. ఎక్కడ?.. ఎందుకు?