Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోదరా జగన్! నువ్వు మారాలి లేకుంటే.. 2019లో నారా లోకేషే సీఎం: రాయపాటి

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే 2019 ఎన్నికల్లో సీఎం కాలేరని తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు జోస్యం చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మార

Advertiesment
rayapati sambasiva rao
, మంగళవారం, 28 మార్చి 2017 (13:30 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే 2019 ఎన్నికల్లో సీఎం కాలేరని తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు జోస్యం చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారకపోతే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా లోకేష్ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు. సోదరా జగన్! నువ్వు మారాల్సిన సమయం వచ్చింది అని రాయపాటి సూచించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారని రాయపాటి అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, ఉపాధి, రైతుల సంక్షేమం కోసం నిధులు లేకున్నా.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని రాయపాటి చెప్పారు. అలాంటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రశంసించాలని జగన్‌కు రాయపాటి సూచించారు. చెడును విమర్శించు అంతే కానీ ప్రభుత్వం ఏం చేసినా విమర్శిస్తూ కూర్చుంటే మాత్రం 2019 ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని హితవు పలికారు.
 
జగన్మోహన్ రెడ్డి పెట్టే సభలకు వచ్చే జనాలంతా దివంగత సీఎం వైఎస్సార్ మీద ఉన్న అభిమానంతో వస్తున్నారే కానీ.. నీపట్ల ఉన్న అభిమానంతో కాదని రాయపాటి అన్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించడం నేర్చుకోవాలన్నారు. ఎన్నికలొస్తే.. ప్రజలు ఎవరు మంచి చేస్తే వారినే ఎన్నుకుంటారనే విషయాన్ని కూడా జగన్ మర్చిపోకూడదని రాయపాటు సూచించారు.
 
అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విమర్శించాలో తెలుసుకోవాలని.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై మద్దతు తెలపాలన్నారు. లేదంటే అధికారంలోకి రావాలన్న  జగన్ కల కలగనే మిగులుతుందని, జగన్ స్థానంలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. విమర్శలు ఎక్కడ చేయాలో అక్కడే చేయాలని.. మిగిలిన సందర్భాల్లో ప్రభుత్వానికి మద్దతిస్తూ ప్రజా సంక్షేమానికి సహాయపడటమే ప్రతిపక్ష నేత బాధ్యత అని రాయపాటి క్లాజ్ తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గిల్గిట్-బాల్తిస్థాన్‌ను మా దేశంలో కలుపుకుంటామన్న పాక్- ఆ పప్పులుడకవ్.. భారత్ వార్నింగ్