Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్ట్ గోదావరిలో రేవ్ పార్టీ... 16 మంది అబ్బాయిలు.. 9 మంది అమ్మాయిలు.. ఏం చేశారంటే?

వెస్ట్ గోదావరి జిల్లాలో రేవ్ పార్టీతో పాటు సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. అర్థరాత్రి వరకు తప్పతాగి అశ్లీల నృత్యాలు, వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తూ రేవ్‌ పార్టీ జరుపుకొంటున్న స్థావరంపై పోలీసులు దాడి చే

Advertiesment
వెస్ట్ గోదావరిలో రేవ్ పార్టీ... 16 మంది అబ్బాయిలు.. 9 మంది అమ్మాయిలు.. ఏం చేశారంటే?
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (11:11 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో రేవ్ పార్టీతో పాటు సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. అర్థరాత్రి వరకు తప్పతాగి అశ్లీల నృత్యాలు, వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తూ రేవ్‌ పార్టీ జరుపుకొంటున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 16 మంది యువకులను, నిర్వాహకురాలిని అరెస్ట్‌ చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న మరో 9 మంది యువతులను అదుపులోకి తీసుకుని స్వధార్‌హోంకు తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామ శివారులో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో రేప్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు ఆదేశం మేరకు... పోలీసు బృందం పత్తేపురం శివారు ఆముదాలపల్లి పరిధిలో ఉన్న చింతలపాటి మూర్తిరాజు గెస్ట్‌ హౌస్‌పై దాడి చేసింది. ఆసమయంలో గెస్ట్ హౌస్‌లో అశ్లీల నృత్యాలతో అసభ్యకర భంగిమల్లో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ వెంటనే గెస్ట్ హౌస్‌లోకి ప్రవేశించి అశ్లీల నృత్యాలు చేస్తున్న తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 16 మంది యువకులను అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు హైదరాబాదు, విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చిన 9 మంది యువతులను అదుపులోకి తీసుకుని స్వధార్‌హోంకు తరలించినట్లు చెప్పారు. వీరిని ఇక్కడకు తీసుకువచ్చిన నిర్వాహకురాలు, హైదరాబాద్‌కు చెందిన బళ్లా హేమను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రపతి వద్దకు పన్నీర్ టీమ్.. పళని పదవికి ఎసరు.. అమ్మ మృతిపై కూడా?