తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరుకు రెడ్డి సత్తిబాబు కమతంలో పుంగనూరు ఆవుకు అరుదైన దూడ జన్మించింది. ఈ దూడ కేవలం 15 అంగుళాలతో జన్మించింది.
ఇప్పటికే గుమ్మిలేరులో వివిధ రైతుల వద్ద ఎన్నో రకాల జాతులకు చెందిన పశు సంతతి ఉంది. ఇక్కడ పశు సంతతి రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు పొందారు. బుధవారం పుట్టిన ఈ దూడ ఎత్తు 15 అంగుళాలు మాత్రమే వుండటం విశేషం.
ఇలాంటి పశు సంతతి అత్యంత అరుదుగా లభిస్తుంది. దీంతో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాలకు చెందిన రైతులు చూసేందుకు ఎగబడుతున్నారు.