Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త స్నేహితులమని కుమారుడి అడ్డం పెట్టుకుని అత్యాచారం చేశారు..

హైదరాబాదులో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గృహిణిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. హైదరాబాదులో నివసిస్తున్న మహిళ భర్త బిడ్డతో కలిసి పుట్టింటికి బయల్దేరింది. మార్గమ

భర్త స్నేహితులమని కుమారుడి అడ్డం పెట్టుకుని అత్యాచారం చేశారు..
, గురువారం, 13 అక్టోబరు 2016 (12:46 IST)
హైదరాబాదులో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గృహిణిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. హైదరాబాదులో నివసిస్తున్న మహిళ భర్త బిడ్డతో కలిసి పుట్టింటికి బయల్దేరింది. మార్గమధ్యంలో భర్తకు ఫోన్ రావడంతో ఆమెను బస్టాప్ వద్ద బస్సు ఎక్కించి వెళ్లిపోయాడు. పుట్టింటికెళ్లిన ఆమెకు రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ భర్త ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రావాలన్నాడు. దీంతో భర్త దగ్గరకు వెళ్లటానికి ఆమె మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద కుమారుడితో కలిసి నిలబడింది.
 
ఆ సమయంలో బైకుపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాము ఆ వివాహిత భర్త స్నేహితులమని నమ్మించి బైక్‌ ఎక్కించుకున్నారు. ఆమె కూడా బైక్ ఎక్కింది. ఆ ఇద్దరూ డిపోచంపల్లి గ్రామ పరిధిలోగల కంబాలకుంట చెరువు కట్ట మీదకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మందు తాగి ఆమె పర్సులో ఉన్న ఐదువేల రూపాయలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. నీ కుమారుడు కావాలంటే మా కోరిక తీర్చాలని బెదిరించారు. ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్న ఆమె భర్త సహకారంతో దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయ్.. బలూచిస్తాన్ వెనకబడిపోయింది: ఉద్యమకారులు