Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంతకూ వర్మ బాధేమిటి. పవన్ కల్యాణ్‌కు డబ్బులొచ్చాయనేనా?

పవన్ సినిమా కాటమరాయుడు చూడడానికి బదులు ఫోర్న్ సినిమా చూడటం బెటర్ అనేసి ఘోరంగా వ్యాఖ్యనించిన వర్మ ఇప్పుడు ఆ సినిమా భారీ కలెక్షన్లు సాదిస్తున్న నేపథ్యంలో వచ్చిన డబ్బులతో కూతుళ్ల బర్త్‌డే పార్టీలు చేసుకుంటావా అంటూ పవన్‌పై డైరెక్ట్ ఎటాక్ చేశాడు.

Advertiesment
Ramgopal varma
హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (07:58 IST)
వరుస ప్లాఫులతో తరిస్తున్న రాంగోపాల్ వర్మకు ట్వీట్ల రోగం కాస్త ముదిరినట్లుంది. మెగా ప్యామిలీపై ట్వీట్ల కత్తులు దూస్తున్న వర్మ తాజాగా కాటమరాయుడుపై పడ్డాడు. మార్చి 24న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న కాటమరాయుడు పవన్ కల్యాణ్‌కు భారీ లాభాలనే కొని తెచ్చినట్లున్నాయి. సినిమా విడుదల రోజునే పవన్ సినిమా కాటమరాయుడు చూడడానికి బదులు ఫోర్న్ సినిమా చూడటం బెటర్ అనేసి ఘోరంగా వ్యాఖ్యనించిన వర్మ ఇప్పుడు ఆ సినిమా భారీ కలెక్షన్లు సాదిస్తున్న నేపథ్యంలో వచ్చిన డబ్బులతో కూతుళ్ల బర్త్‌డే పార్టీలు చేసుకుంటావా అంటూ  పవన్‌పై డైరెక్ట్ ఎటాక్ చేశాడు. 
 
రాజకీయ రంగ ప్రవేశం కోసం పవన్ సినిమాల ద్వారా కాస్త వెనకేసుకోవాలని అనుకోవడం నిజమే కావచ్చు. రాజకీయాలకోసమో, లేదా వ్యక్తిగతంగా కూడా భారీలాభాలు రావాలంటే ఈ రోజుల్లో సినిమాను మించిన ఈజీ సాధనం మరొకటి లేదు. ఇది అందరికీ తెలుసు. హిట్లు ఇచ్చే కిక్కు వర్మకు తెలీంది కాదు. కానీ మరీ వ్యక్తిగతానికి వెల్లి పవన్ కల్యాణ్ లాభార్జనకు కూతుళ్ల బర్త్‌డే పార్టీలకు ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం ఎంతమేరకు సబబని సినీ విమర్శకుల వ్యాఖ్య.
 
ఇంతకూ వర్మ ఏమన్నాడు. కాటమరాయుడు సినిమాను 30 కోట్లతో తీసి, దాన్ని 100 కోట్లకు అమ్ముకుని, 70 కోట్లను జేబులో వేసుకుని కూతుళ్ల బర్త్‌డే పార్టీలను చేసుకోవడం చూస్తుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు ఉందని వర్మ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగాడా అంటే లేదు. పవన్ ఫ్యాన్స్‌మీద పోయి పడ్డాడు. ధియేటర్లలో గొడవ చేసేవారు, పేపర్లు చించేవారు., ఇతరుల ప్రోగ్రాములకు అడ్డు తగిలేవారు పవన్ ప్యాన్సేనా అని ప్రశ్నించారు. 
 
చివరకు పవన్ ఫ్యాన్స్‌గా బయట చెప్పుకుని తిరిగే వాళ్లు అతడిని పక్కదోవ పట్టిస్తున్నారని, ఎవరు నిజమైన అభిమానులో పవన్ గుర్తించకపోవడానికి వీల్లే కారణమని వర్మ అభిమానులపై బురద చల్లాడు. ఇదంతా చూస్తుంటే రాంగోపాల్ వర్మపై భౌతిక దాడులు జరిగే వీలుందని కూడా అనుమానాలు వస్తున్నాయి. 
 
పవన్ కల్యాణ్ అభిమానులు ఆ స్థాయికి వెళ్లరనే ఆశిద్దాం. అబిమానుల మాట అలా ఉంచితే ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి వర్మ ఫిట్టింగ్ రిప్లై అందుకునే వీలుందని భావిస్తున్నారు. 
 
మొత్తం మీద ట్వీట్లలో వ్యక్తిగతానికి, బహిరంగానికి మధ్య తేడా లేకుండా పోతుందా అనిపిస్తోంది. దీనికి ఎంత త్వరగా అడ్డుకట్ట పడితే ఇరు పక్షాలకూ అంత మంచిదేమో..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికన్‌ త్యాగానికి ప్రవాస భారతీయుల కృతజ్ఞతా కానుక