Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పబ్లిక్ పాలసీ సలహాదారుగా భాద్యతలు స్వీకరించిన రామచంద్రమూర్తి

పబ్లిక్ పాలసీ సలహాదారుగా భాద్యతలు స్వీకరించిన రామచంద్రమూర్తి
, బుధవారం, 16 అక్టోబరు 2019 (17:34 IST)
పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం నేపధ్యంలో ప్రజా సమస్యలపై విస్రృత అవగాహన ఉన్న సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి బుధవారం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. పత్రికా రంగంలో విశేష అనుభవం కలిగిన రామచంద్రమూర్తిని ప్రభుత్వం పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సమక్షంలో నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఎమెస్కో విజయకుమార్‌తో పాటు పలువురు సాహిత్య రంగ నిఫుణులు పాల్గొన్నారు. రామచంద్రమూర్తి అర్థశతాబ్దం పైగా పత్రికా రంగంలో వివిధ హోదాలలో పనిచేసారు.
 
ఆంధ్రప్రభలో పాత్రికేయినిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రస్, దక్కన్ క్రానికల్, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలలో వివిధ హోదాలలో పని చేసారు. ఎలక్ట్రానిక్ మీడియా పరంగానూ తనదైన ముద్రను చూపారు. జెమిని టివిలో సుదీర్ఘ కాలం ప్రచారం అయిన పత్రికా ప్రపంచం కార్యక్రమంతో పాటు, దూరదర్శన్‌లో అభివృద్ది కార్యక్రమాలనుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
 
హెచ్ఎంటివిలో దశ-దిశ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నాటి సమైఖ్య రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. వందేళ్ల కథకు వందనాలు పేరిట నిర్వహించిన కార్యక్రమం సాహితీ ప్రియులతో పాటు, సగటు మనిషిని కూడా ఆకర్షింప చేసింది. సుదీర్ఘ కాలం పాత్రికేయునిగా నేటితరం జర్నలిస్టులకు మార్గదర్శిగా ఉన్న రామచంద్రమూర్తిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించటం ద్వారా పత్రికా ప్రతినిధులకు తమ ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పారు. ఈ నేపధ్యంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని చేజారనీయబోనని, ప్రజలకు అవసరమైన విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొరివి పెట్టిన తరువాత పాడె మీద నుంచి లేచిన శవం, పరుగులు తీశారు