Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్మకు ఈ మధ్య కాలంలో మైండ్ దొబ్బింది నిజమేనా ఈసారి మోదీమీద పడ్డాడే..

వివాదాల కింగ్ రాంగోపాల్ వర్మకు నిజంగానే మైండ్ దొబ్బిందా.. రెండు రోజులక్రితమే సన్నీలియోన్‌ను ఉటంకిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసి అభాసు పాలై జీవితంలో తొలిసారి క్షమాపణ చెప్పిన వర్మ ఇకపై ఈ ట్రెండ్‌నే కొనసాగి

Advertiesment
Elections-2017
హైదరాబాద్ , ఆదివారం, 12 మార్చి 2017 (01:45 IST)
వివాదాల కింగ్ రాంగోపాల్ వర్మకు నిజంగానే మైండ్ దొబ్బిందా.. రెండు రోజులక్రితమే సన్నీలియోన్‌ను ఉటంకిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసి అభాసు పాలై జీవితంలో తొలిసారి క్షమాపణ చెప్పిన వర్మ ఇకపై ఈ ట్రెండ్‌నే కొనసాగించనున్నారా అంటే అవుననిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించిన అనంతరం మోదీకి వత్తాసు పలికిన పర్మ అతడు రాముడి కంటే గొప్పవాడని ఒక రేంజిలో పొగిడేశాడు. పనిలోపనిగా రామరాజ్యం గురించి కామెంట్ చేసి మరో వివాదం కొని తెచ్చుకున్నాడు. 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రముఖులంతా వారికి తోచిన రీతిలో స్పందిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ దర్శక దిగ్గజం రాంగోపాల్‌వర్మ.. అందరిలోకి భిన్నంగా, కాస్త వివాదాస్పదంగా కామెట్లు చేశారు. మొన్న మహిళాదినోత్సవం సందర్భంగా సన్నీ లియోన్‌ను ఉటంకిస్తూ ట్వీట్లు చేసిన ఆయన.. ఇవ్వాళ నరేంద్ర మోదీని రాముడికంటే గొప్పదేవుడంటూ కీర్తించి సరికొత్త వివాదానికి తెరలేపారు. పనిలో పనిగా తన 'సర్కార్‌-3'ని కూడా ప్రమోట్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ వర్మ ఏమన్నారంటే..
 
నరేంద్ర మోదీ సర్కార్‌ కంటే సీనియర్‌ బచ్చన్‌ నటించిన సర్కార్‌-3నే బాగుంటుందని, అయితే త్వరలో అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి మోదీ చేయబోయే సర్కార్‌గిరీని మాత్రం తాను ఇష్టపడతానని వర్మ తెలిపారు. 'నా ఉద్దేశంలో శ్రీరాముడి కన్నా నరేంద్ర మోదీనే పెద్ద దేవుడు. నాటి(పురాణాల్లో చెప్పే) రామరాజ్యాన్ని నేను చూడలేదు. నరేంద్ర మోదీ ఏలికలోని అయోధ్య రాజ్యంలో ఉండటాన్ని ఇష్టపడుతున్నా' అని దర్శకదిగ్గజం పేర్కొన్నాడు. కాగా, వర్మ ట్వీట్లపై బీజేపీ నేతలుగానీ, హిందూత్వవాదులుగానీ ఇంకా స్పందిచలేదు.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీని గెలిపించాడు.. నితీశ్‌ని గెలిపించాడు.. యూపీలో తుస్సుమన్నాడు. అంతా రాహుల్ మహిమేనా?