Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ గన్‌ను పేల్చేది జగన్ ఒక్కడే.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల అర్థం ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి హీరోలపై ట్వీట్ల యుద్ధం చేస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై దృష్టి పెట్టాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని రా

Advertiesment
ఏపీ గన్‌ను పేల్చేది జగన్ ఒక్కడే.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల అర్థం ఏమిటి?
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:44 IST)
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి హీరోలపై ట్వీట్ల యుద్ధం చేస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై దృష్టి పెట్టాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని రామ్ గోపాల్ వర్మ తిట్టకుండా.. ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ ట్వీట్లతో జగన్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం కామ్‌గా ఉంటున్నారు. 
 
ఇంతకీ జగన్‌పై వర్మ ఎలాంటి కామెంట్స్ చేశాడంటే.. ఏపీని తుపాకీతో పోల్చాడు. ఆ గన్‌ను పేల్చేది జగనేనని చెప్పాడు. దీనిని బట్టి 2019లో జగన్మోహన్ రెడ్డికే ప్రజలు పట్టం కడుతారా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏపీ మ్యాప్‌ను చూస్తే తుపాకీలా ఉంటుందని చెప్పిన వర్మ... ఆ గన్‌ను పేల్చేది మాత్రం ఒక్క జగన్ మాత్రమేనని చెప్పడం వెనక జగనే తదుపరి సీఎం అవుతారని చెప్పకనే చెప్పాడా అని చర్చ సాగుతోంది.
 
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా వర్మ ట్వీట్లపై స్పందించారు. ఓసారి తనను మెచ్చుకోవచ్చు, మరోసారి తిట్టవచ్చునని... కానీ వర్మ ట్వీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పెళ్లైన కూతురును పెట్టుకొని పోర్న్ వీడియోలు దగ్గర ఉంచుకుంటానని చెప్పిన అతని గురించి ఏం మాట్లాడుతామని వ్యాఖ్యానించారు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు కూడా దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ ముసుగులో మోసం.. పదేళ్ల ప్రేమ.. ఆపై సహజీవనం.. నిన్ను పెళ్లి చేసుకోననని మెసేజ్..