Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ ఒక్కడే దేశద్రోహా వర్మగారూ... మిగతా అగ్ర హీరోల మాటేమిటి?

మహేష్ అభిమానులు ఆయనకు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపమని చెప్పకపోతే వారు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర సమస్యల కన్నా పవన్ గురంచి ఎక్కువగా కంగారు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుం

Advertiesment
మహేష్ ఒక్కడే దేశద్రోహా వర్మగారూ... మిగతా అగ్ర హీరోల మాటేమిటి?
హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (02:45 IST)
చూడగానే ఘాటెక్కించే మసాలా ట్వీట్లతో అభిమానులను, నెటిజన్లను అలరిస్తున్న రాంగోపాల్ వర్మ మెగా కుటుంబాన్ని వదిలిపెట్టి మహేష్ బాబుపై దేశద్రోహ ఆరోపణలతో విరుచుకుపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే సినిమాలు, నటనలు, కలెక్షన్లు వంటి అంశాలపై కాకుండా ప్రత్యేక హోదా ప్రదర్శనల సందర్భంగా వర్మ రూట్ మార్చి మహేష్‌బాబును టార్గెట్ చేశాడు. 
 
తన ట్వీట్లతో ఎప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ ఈ సారి టార్గెట్ మార్చాడు. ప్రత్యేక హోదా కోసం పవన్ వరుస ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకటం లేదని ప్రశ్నించాడు. తమిళ సాంప్రదాయం కోసం ట్వీట్ చేసిన మహేష్, తన సొంతం ప్రాంతమైన ఆంధ్రుల పోరాటానికి ఎందుకు మద్దతివ్వలేదన్నాడు.
 
మహేష్ బాబు తమిళ పండుగకు మద్దతిచ్చి ఆంధ్రుల జీవన పోరాటానికి ఎందుకు మద్దతివ్వటం లేదు.. అంటే అతనికి రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్నంత బాధ్యత లేదా.. మహేష్ డబ్బింగ్ మార్కెట్ కోసం బాదపడ్డంత, అతన్ని సూపర్ స్టార్ని చేసిన అసలు మార్కెట్ కోసం బాదపడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ పోరాటంతో కలిసిరాని సెలబ్రిటీలు ద్రోహులుగా మిగిలిపోతారు.
 
మహేష్ అభిమానులు ఆయనకు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపమని చెప్పకపోతే వారు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర సమస్యల కన్నా పవన్ గురంచి ఎక్కువగా కంగారు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటే జల్లికట్టుకు ఎందుకు సపోర్ట్ చేసినట్టు, పవన్కు ఎందుకు సపోర్ట్ చేయనట్టు..' అంటూ తనదైన స్టైల్లో ప్రశ్చించాడు వర్మ.
 
వర్మ ట్వీట్లు కత్తి పెట్టి కోసినట్లు నొప్పించినా దాంట్లో వాస్తవం పాలు ఎంతో కొంత ఉండే ఉంటుందని నెటిజన్ల అభిప్రాయం. అందుకే సినిమాలు, కలెక్షన్లు, బిజినెస్ వ్యూహాలు తప్ప ఇంకేమీ పట్టించుకోని మహేష్‌పై వర్మ చేసిన ట్వీట్లు గురువారం ఒక రేంజిలో పేలాయి. ముఖ్యంగా తమిళ పండుగ జల్లికట్టుకు మద్దతిచ్చి ఆంధ్రుల జీవన పోరాటానికి ఎందుకు మద్దతివ్వటం లేదు అంటూ వర్మ వేసిన ప్రశ్న చిత్రసీమలో అందరికీ సూటిగా తగిలే ఉంటుంది.
 
ఈ సందర్భంగా గుర్తించుకోవలిసింది ఏమిటంటే చిత్రసీమలోకి నిన్న కాక మొన్న ప్రవేశించిన చిట్టిపొట్టి నటులు, మెగా స్టార్ కుటుంబంలోని కొత్త హీరోలు కూడా ప్రత్యేక హోదాకు మద్దతివ్వగా టాలీవుడ్ లోని అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్‌లకు ఏం రోగమొచ్చిందనుకోవాలి, వీళ్లెవరికీ తెలుగు ప్రజల జీవన్మరణ సమస్య పట్టదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత కులాలపరంగా నటుల వెనుక చేరి చీలిపోయిన అభిమానులు కూడా ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఏదో ఒకరకమైన మద్దతు నిస్తున్న వాతావరణం ఏర్పడింది. కానీ హీరోయిజం పేరుతో జనం నుంచి కోట్లాది డబ్బు టికెట్ల రూపంలో లాగేసుకుంటున్న ఈ అగ్రహీరోలు ఇంత సైలెంటుగా ఉండటంలోని మతలబేంటి అన్నది అందరినీ దొలిచేస్తోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం టైమింగ్ బాబూ తమరిది. హోదాను దేశభక్తితో కొట్టారే?