రాజ్యసభ ఎన్నికలు : టీడీపీ తరపున ముగ్గురు.. వైకాపా తరపున విజయిసాయి రెడ్డి ఏకగ్రీవం!
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం పార్టీ తరపున నాలుగో సీటుకు పోటీ పెట్టే యోచనను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరమించుకోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం పార్టీ తరపున నాలుగో సీటుకు పోటీ పెట్టే యోచనను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరమించుకోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.
టీడీపీ-బీజేపీ కూటమి తరపున మూడు సీట్లకు ముగ్గురు అభ్యర్ధులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో సీటుకు వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన సతీమణితో కూడా నామినేషన వేయించారు. అది డమ్మీ నామినేషన మాత్రమేనని, నామినేషన్ల పరిశీలన తర్వాత ఉపసంహరించుకుంటారని వైసీపీ నేతలు ప్రకటించారు.
కాగా.. టీడీపీ, బీజేపీ అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమం అసెంబ్లీలో కోలాహలంగా జరిగింది. బీజేపీ తరపున రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి), మాజీ మంత్రి టీజీ వెంకటేశ నామినేషన్లు వేశారు. ముగ్గురు అభ్యర్ధుల నామినేషన పత్రాలపై మొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విషయం తెల్సిందే.