జిత్తులమారి నక్క రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్.. తెలివిగా తప్పించుకున్న వైనం!
పీజే కురియన్. రాజ్యసభ ఉపసభాపతి. సభలో అధికార, విపక్ష సభ్యులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో మంచి దిట్ట. ఈ విషయం మరోమారు నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కే
పీజే కురియన్. రాజ్యసభ ఉపసభాపతి. సభలో అధికార, విపక్ష సభ్యులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో మంచి దిట్ట. ఈ విషయం మరోమారు నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లుపై ఓటింగ్ జరగకుండా తప్పించిన వైనంతో ఈ విషయం మరోమారు నిరూపితమైంది.
ఈ బిల్లుపై విపక్ష సభ్యులు ఓటింగ్‌కు పట్టుబట్టగా, అధికార సభ్యులు అందుకు ససేమిరా అన్నారు. ఇది ఒక రకంగా కురియన్‌కు అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఆయన చాలా తెలివిగా తప్పించుకున్నారు. స్వతహాగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేత. కేవీపీ బిల్లు మనీ బిల్లు అని చెబితే సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగని కాదంటే కేంద్రానికి ఎదురు తిరగడమే అవుతుంది.
కావాలని కష్టాలను కొనితెచ్చుకోవడం ఎందుకని భావించిన కురియన్ సాహసాలను పక్కనపెట్టి బిల్లు చిక్కుముడి నుంచి తెలివిగా బయటపడ్డారు. ఈ తలనొప్పి తనకెందుకు అనుకున్న కురియన్ కేవీపీ బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదించి చేతులు దులుపుకున్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మనీ బిల్లుగా తేల్చితే బిల్లు వీగిపోయి చెత్తబుట్టలోకి వెళ్తుంది. అవునంటే తిరిగి రాజ్యసభకు ఓటింగ్‌కు వెళ్తుంది. దీంతో స్పీకర్ నిర్ణయం కోసం ఏపీ ప్రజలు ఆశగా చూస్తున్నారు.